Selfies: నోట్ల కట్టలతో సెల్ఫీలు.. వైరల్ అయిన ఫొటోలు..

ఓ పోలీస్ అధికారి చేసిన పనికి అతను బదిలీ కావాల్సి వచ్చింది. భార్య తీసిని సెల్ఫీయే ఇందుకు కారణం. ఆ పోలీస్ అధికారి భార్య నోట్ల కట్టలతో సెల్ఫీ దిగడంతో.. ఆ ఫొటోలు కాస్త వైరల్ కావడంతో అధికారిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి తన భార్య, పిల్లల కరెన్సీ నోట్ల కట్టలను చూపుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా రమేష్ చంద్ర సహాని పని చేస్తున్నారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు 500 కరెన్సీ నోట్లతో మంచం మీద కూర్చుని సెల్ఫీలు దిగారు. ఆ రూ.500 నోట్ల కట్టల విలువ రూ.14 లక్షలుగా నిర్ధారించారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ శంకర్ మీనా, SHOపై చర్యలు తీసుకున్నారు.

selfieswithbundlesofrs-500-

బంగార్‌మావు సర్కిల్ అధికారి (CO) విచారణకు ఆదేశించారు. "స్టేషన్-హౌస్ ఆఫీసర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది పోలీసు భార్య, అతని పిల్లలను నోట్ల కట్టలతో చూపిస్తుంది. మేము ఈ విషయాన్ని గుర్తించాము. రమేష్ చంద్ర సహానిను పోలీస్ లైన్‌కు బదిలీ చేసాము. దర్యాప్తు ప్రారంభించాం" అని ఓ అధికారి తెలిపారు.

వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లో, సహాని కుటుంబ సభ్యులు రూ. 500 కరెన్సీ నోట్ల కట్టలతో కూర్చున్నట్లు CO పంకజ్ సింగ్ తెలిపారు. ఈ అంశంపై విచారణ జరుగుతోందని తెలిపారు. పోస్ట్‌లో కనిపించిన కరెన్సీకి సంబంధించి పోలీసులు కచ్చితమైన లెక్క చెప్పనప్పటికీ, అది రూ. 14 లక్షలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫొటోలపై రమేష్ చంద్ర సహాని స్పందించారు. 2021 నవంబర్ 14న తాను ఆస్తిని విక్రయించినప్పుడు వచ్చిన డబ్బుతో వారు సెల్ఫీ దిగారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+