ఘనంగా పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా నిశ్చితార్థం: చూడముచ్చటగా ఫొటోలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) పార్లమెంట్ సభ్యుడు రాఘవ్ చద్దా(Raghav Chandha), బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా(Parineeti Chopra)ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. శనివారం రాత్రి సెంట్రల్ ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఈ వేడుక జరిగింది. ఇరువురి కుటుంబసభ్యులతోపాటు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
దాదాపు 150 మంది అతిథుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకుని వైవాహిక బంధంతో ఒక్కటయ్యేందుకు సిద్ధమైంది. తమ నిశ్చితార్థం పొటోలను రాఘవ్, పరిణీతి ఇద్దరూ కూడా తమ ఇన్‌స్టా ఖాతాల్లో పంచుకున్నారు. త్వరలో ఒక్కటి కాబోతున్న ఈ జంటకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

రాఘవ్-పరిణీతిల నిశ్చితార్థ వేడుకకు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, పరిణీతి సోదరి ప్రియాంక చోప్రా జోనస్, కాంగ్రెస్ నేత పీ చిదంబరం, శివసేన(యూబీటీ) నేత ఆదిత్య థాక్రే, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రెయిన్ తదితరులు హాజరయ్యారు.
సోదరి నిశ్చితార్థ వేడుకలో పాల్గొనేందుకు శనివారం ఉదయమే అమెరికా నుంచి వచ్చారు ప్రియాంక. పసుపు రంగు చీరలో ప్రియాంక మెరిసిపోయారు. నిశ్చితార్థ వేడుక సందర్బంగా ముంబైలో పరిణీతి చోప్రా నివాసం, ఢిల్లీలోని రాఘవ్ చద్దా ప్రభుత్వ భవనాలను ప్రత్యేకంగా విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు.
Everything I prayed for .. I said yes! 💍
— Parineeti Chopra (@ParineetiChopra) May 13, 2023
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਮਿਹਰ ਕਰਨ। 🙏🏻 pic.twitter.com/xREJWjEr7n
కాగా, నిశ్చితార్థ వేడుక సందర్భంగా దిగిప రాఘవ్-పరిణీతీల పొటోలు చూడముచ్చటగా ఉన్నాయి. ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చాలాసార్లు కలిసి పలు ప్రాంతాల్లో మీడియా కంటకూడా పడ్డారు.
#WATCH | Delhi: AAP MP Raghav Chadha and actress Parineeti Chopra make their first public appearance after their engagement ceremony pic.twitter.com/I2l7JxQOq8
— ANI (@ANI) May 13, 2023
परिणीति चोपड़ा और राघव चड्ढा की सगाई में पहुंची प्रियंका चोपड़ा #parineetiraghav #parineetiraghavengagement #parineetichopra #raghavchadha #priyankachopra #connaughtplace pic.twitter.com/ZfQ2m9ZA17
— Kamal nayan (@kamal002nayan) May 13, 2023
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications