ప్రియురాలి అలక: నగరమంతా ‘సారీ’ హోర్డింగ్స్ పెట్టాడు! షాకిచ్చిన పోలీసులు
Recommended Video

ముంబై: తన ప్రియురాలు అలిగిందని ఓ యువకుడు తీవ్రంగా మదనపడ్డాడు. ఆమెను ఎలాగైనా అలక వీడేలా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. ఏకంగా నగరం మొత్తం ఆమెకు 'సారీ' చెబుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది.

ప్రియురాలి కోపాన్ని తగ్గించేందుకు..
ఆ వివరాల్లోకి వెళితే.. పుణెలోని పంప్రి చించ్వాడ్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అయిన నీలేశ్ ఖేడేకర్ అనే వ్యక్తి... తన ప్రేయసితో స్వల్పంగా గొడవ కావడంతో ఆమె అలకబూనింది. ఆమె కోపాన్ని తగ్గించడానికి వినూత్నంగా సారీ చెప్పాలనుకున్నాడు.

..ఐ యామ్ సారీ అంటూ..
ఆమె వెళ్లే దారిలో, ఇతర రద్దీప్రాంతాల్లో ‘.. ఐ యామ్ సారీ' అంటూ పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు కట్టించాడు. గత శుక్రవారం నగరంలో అక్కడక్కడా బ్యానర్లు, హోర్డింగ్‌లను చూసి పోలీసులు షాకయ్యారు. అనుమతి లేకుండా ఈ హోర్డింగులు పెట్టడంతో పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

షాకిచ్చిన పోలీసులు
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆ బ్యానర్లు కట్టించిన వ్యక్తి గురించి ఆరా తీయగా అతను నిలేశ్ అని తేలింది. అనుమతుల్లేకుండా అక్రమంగా ఇలా బ్యానర్లు కట్టించినందుకు గానూ అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రియురాలికి సారీ ఏమో గానీ, నీలేశ్‌కు మాత్రం కేసు నమోదు చేసి భారీ షాకిచ్చారు.

300లకుపైగా హోర్డింగుల ఏర్పాటు
కాగా, తను ప్రేమించిన యువతి శుక్రవారం ముంబై నుంచి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే నీలేశ్ ఈ హోర్డింగులు ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. అతని స్నేహితుడి ద్వారా నీలేశ్ ఈ పని చేశాడని తెలుసుకున్నామని చెప్పారు. ఆ అమ్మాయి వచ్చే మార్గంలో సుమారు 300కుపైగా హోర్డింగులు ఏర్పాటు చేశారని తెలిపారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications