పికె సాహసం, అద్భుతం: అద్వానీ, అమీర్ ఖాన్‌కు బూస్ట్

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించిన పికె సాహసంతో కూడిన అద్భుతమైన సినిమా అని బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ అభివర్ణించారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఆ సినిమాను అద్వానీ ఇటీవలే చూశారు. ఆ చిత్రం ఆయనకు ఎంతో నచ్చింది. అంతే కాకుండా, మెజారిటీ ప్రజలు దాన్ని చూడాల్సిందేనని ఆయన అన్నారు.
ధైర్యంతో కూడిన అద్భుతమైన చిత్రం నిర్మించినందుకు రాజ్‌కుమార్ హిరానీకి, విధు వినోద్ చోప్రాకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో అన్నారు. భారత్ వంటి విశాలమైన, వర్ణశోభితమైన దేశంలో పుట్టినందుకు మనం అదృష్టవంతులమని ఆయన అన్నారు.
కులం లేదా కమ్యూనిటీ, భాష, ప్రాంతం, తప్పకుండా మతం వంటివేవీ దేశ సమైక్యతను బలహీనపరచలేవనే విషయాన్ని సినిమా అద్భుతంగా చూపించిందని ఆయన అన్నారు. మతమనేది మన దేశంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన వనరు, నైతిక ప్రవర్తనకు సంబంధించిందని, ప్రతి మతం కూడా దేశ సమైక్యతకు తోడ్పతుందని ఆయన అన్నారు.
ఇటీవల విడుదలైన పికె సినిమాలో చెప్పిన ప్రాథమికమైన పాఠం అదేనని, అమీర్ ఖాన్ అద్భుతంగా నటించాడని, అనుష్క శర్మ, బోమన్ ఇరానీ కూడా బాగా నటించారని ఆయన అన్నారు. పికె సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications