విజయ్ మాల్యా అప్పును రద్దు చేసినట్టుగానే నా అప్పును రద్దు చేయండి
విదేశాల్లో తలదాచుకొంటున్న విజయ్ మాల్యాకు రద్దు చేసినట్టుగానే తన అప్పును కూడ రద్దు చేయాలని త్రయంబకేశ్వర్ మున్సిఫాలిటిటో పనిచేసే పారిశుద్య కార్మికుడు ఎస్ బి ఐ కి లేఖ రాశాడు.
ముంబాయి :కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తరహలోనే తన అప్పును కూడ రద్దు చేయాలని కోరుతూ బాపూరావ్ సానావనె ఓ పారిశుద్య కార్మికుడు ఎస్ బి ఐ కి లేఖ రాశాడు.విజయ్ మాల్యా అప్పులను రద్దు చేయడం పట్ల ఆయన స్వాగతించారు. ఎస్ బి ఐ నిర్ణయం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అయితే మాల్యా అప్పులు రద్దు అయినట్టు కాదని, వాటిని వసూలు చేస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన రాకముందే ఆయన ఈ లేఖ రాశాడు.
కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా సహా దేశంలోని పలు కంపెనీలు, వ్యక్తుల బకాయిలను రద్దు చేస్తున్నట్టు బ్యాంకులు ప్రకటించాయి. ఈ విషయమై విదేశాల్లో తలదాచుకొంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా 7 వేల కోట్లను రద్దుచ ేస్తున్నట్టు ఎస్ బి ఐ ఇటివల ప్రకటించింది. ఈ ప్రకటన ఎస్ బి ఐ తీరుపై విమర్శల వెల్లువలా వచ్చింది.

చిన్న అప్పులు ఇచ్చేందుకు ఇబ్బందులు పెట్టే బ్యాంకులు పెద్దలకు మాత్రం కోట్లాది రూపాయాలను అప్పుగా ఇవ్వడమే కాదు....ఆ అప్పులను కూడ రద్దుచేయడం సర్వసాధారణమైంది. అయితే విజయ్ మాల్యా తీసుకొన్న అప్పును రద్దు చేయడంతో మహరాష్ట్ర నాసిక్ లోని త్రయంబకేశ్వర్ మున్సిఫల్ కౌన్సిల్ లో పనిచేసే పారిశుద్య కార్మికుడు బాపూరావ్ సానావనె కూడ తన అప్పును రద్దు చేయాలని ఎస్ బి ఐ కి లేఖ రాశాడు.
మాల్యాకు ఏ రకంగా అప్పును రద్దు చేశారో తనకు కూడ అదే పద్దతిలో అప్పును రద్దు చేయాలని కోరారు.తన కుమారుడి రోగాన్ని నయం చేసేందుకుగాను ఆయన అప్పు తీసుకొన్నాడు. అయితే తనకు బ్యాంకు నుండి సమాచారం రాలేదని బాపూరావు చెబుతున్నారు.అయితే మాల్యా అప్పులు రద్దు చేయలేదని, వాటిని వసూలు చేస్తామని రాజ్యసభలో ఆర్థికశాఖ మంత్రి జైట్లీ స్పష్టం చేశాడు.జైట్లీ ప్రకటనకు ముందే పారిశుద్య కార్మికుడు లేఖ రాశాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications