అమెరికా పర్యటనకు మోదీ: జాయింట్ కాంగ్రెస్‌లో ప్రసంగం- వైట్‌హౌస్‌లో విందు

వాషింగ్టన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. తన పర్యటన సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా భాగస్వామ్యంతో జనరల్ ఎలక్ట్రిక్ జెట్ ఇంజిన్లు తయారీతో పాటు అడ్వాన్స్డ్ డిఫెన్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జీ20 అత్యున్నత సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న విషయం తెలిసిందే. అమెరికా సహా జీ20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ భేటీలో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. ఈ భేటీ అజెండాలో చేర్చాల్సిన అంశాలు, ప్రస్తావనకు తీసుకుని రావాల్సిన విషయాలపైనా మోదీ.. జో బైడెన్‌తో చర్చిస్తారు.

 PM Modi

2021లో మోదీ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. అప్పట్లో వైట్‌హౌస్‌ను సందర్శించారాయన. అది- క్వాడ్ సమ్మిట్‌లో భాగం. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలకు క్వాడ్‌లో సభ్యత్వం ఉంది. అమెరికా వేదికగా జరిగిన క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనడానికి అప్పట్లో మోదీ ఆ దేశ పర్యటన చేపట్టారు. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా ఆయన పర్యటన సాగబోతోంది.

తమ దేశ పర్యటనకు వచ్చే మోదీకి జో బైడెన్ నుంచి అరుదైన ఆహ్వానం లభించింది. జూన్ 22వ తేదీన వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసే విందుకు హాజరు కావాలంటూ జో బైడెన్, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ నుంచి మోదీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు, ఆయన భార్య.. భారత ప్రధానికి వైట్ హౌస్‌లో విందు ఏర్పాటు చేయడం సుదీర్ఘ విరామం తరువాత ఇదే తొలిసారి.

అదే సమయంలో అమెరికన్ కాంగ్రెస్ సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఈ మేరకు అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ స్పీకర్ కెవిన్ మెక్‌క్యార్థీ పంపించిన ఆహ్వానాన్ని అంగీకరించారు. ఈ మేరకు మోదీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ నెల 22వ తేదీన అమెరికన్ జాయింట్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

సెనేటర్ లీడర్ చార్లెస్ షుమెర్, హౌస్ స్పీకర్ కెవిన్ మెక్‌క్యార్థీ, సెనేట్ రిపబ్లికన్ లీడర్ మిచ్ మెక్‌కానెల్, హౌస్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్ హకీమ్ జెఫ్రీస్ ఆహ్వానాన్ని అంగీకరించానని, దీన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తోన్నానని మోదీ పేర్కొన్నారు. మరోసారి కాంగ్రెస్ జాయింట్ మీటింగ్‌లో ప్రసంగించడానికి ఎదురు చూస్తోన్నానని మోదీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+