ముకుల్ రాయ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్: మమతా బెనర్జీ బెనర్జీ మేనల్లుడి ఎంట్రీతో ప్రాధాన్యత

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌కు గురువారం ఫోన్ చేశారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సతీమణి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గురువారం ఉదయం 10.26గంటలకు తన తండ్రికి ప్రధాని మోడీ ఫోన్ చేశారని ముకుల్ రాయ్ తనయుడు సుభ్రాంగ్ష్ తెలిపారు.

తన తల్లి ఆరోగ్యం గురించి ప్రధాని మోడీ వాకబు చేశారని చెప్పారు. తన భార్య కృష్ణా రాయ్‌కు ప్రస్తుతం కరోనా నెగిటివ్ అని తేలిందని, అయితే, పూర్తిగా కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ముకుల్ రాయ్.. ప్రధాని మోడీకి వివరించారు. రాయ్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

PM Modi dials Mukul Roy amid buzz over his return to TMC

ఇది ఇలావుండగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లి ముకుల్ రాయ్ సతీమణిని పరామర్శించి వెళ్లారు. కాగా, ముకుల్ రాయ్ కూడా కరోనా బారినపడి ఇంట్లోనే కోలుకుంటున్నారు. అభిషేక్ బెనర్జీ ఆస్పత్రికి వెళ్లిన సమయంలో అక్కడ సుభ్రాంగ్ష్ ఉన్నారు.

ఆ తర్వాత కొద్ది గంటలకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మరోవైపు, ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీఎంసీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ముకుల్ రాయ్‌కు ఫోన్ చేసి మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, టీఎంసీ వ్యవస్థాపక సభ్యుల్లో ముకుల్ రాయ్ కూడా ఒకరు కావడం గమనార్హం. 2017లో ఆయన టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. 2020లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్ష పదవి వరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ ఉత్తరం సీటు నుంచి ఆయన గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+