Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జిల్ బైడెన్ కు ప్రధాని మోదీ అదిరిపోయే గిఫ్ట్ - పీఎం విందులో ప్రత్యేకంగా..!!

అమెరికాలో ప్రస్తుతం ప్రధాని మోదీ మేనియా కొనసాగుతోంది. ప్రధాని మోదీకి శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. సాదరంగా ప్రధానిని ఆహ్వానించిన అధ్యక్షుడు జో బైడెన్..ప్రధమ మహిళ బిల్ బైడెన్ లు ప్రత్యేకంగా విందుల..బహుమానాలు..సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేసారు. ఈ సమయంలో ప్రధానికి ఆ ఇద్దరు ప్రత్యేక బహుమానాలు అందించారు. ప్రధాని మెదీ సైతం బిల్ బైడెన్ కు డైమండ్ గిఫ్ట్ గా ఇచ్చారు.

మోదీకి ప్రత్యేక ఆతిథ్యం:
వైట్ హౌస్ లో ప్రధాని మోదీకి ప్రత్యేక ఆతిథ్యం లభించింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్..బిల్ బైడెన్ తో ప్రధాని మోదీ చర్చలు చేసారు. అనంతరం విందులో పాల్గొన్నారు. ఈ సారి మోదీకి ఇచ్చిన విందులో ప్రత్యేకంగా మిల్లెట్స్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అధికారిక మెనూలో చిరుధన్యాల వంటకాలను చేర్చారు.

PM Modi gifts a lab-grown 7.5-carat green diamond to US First Lady Dr Jill Biden on his first state visit to US

విందులో ఫస్ట్ కోర్సులో మారినేటెడ్ మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలా్, అవకాడో సాస్ ఏర్పాటు చేసారు. మెయిన్ కోర్సులో స్టఫ్డ్ పోర్టబోల్లో మష్రూమ్స్, కుంకుమ పువ్వుతో కూడిన రిసోటో, లెమన్ దిల్ యోగర్ట్ సాస్, క్రిస్ప్ డ్ మిల్లెట్ కేక్స్, వేసవి పానీయాలు ఉన్నాయి. ప్రధానికి ఇచ్చే విందును వైట్ హౌస్ చెఫ్ సుసీ మారిసన్ తయారు చేసారు.

మోదీకి జో - బిల్ బైడెన్ కానుకలు:ప్రధాని మోదీకి జో - బిల్ బైడెన్ కానుకలు అందించారు. 20వ శతాబ్దపు ప్రారంభపు కాలానికి చెందిన పురాతన అమెరికన్ బుక్ గ్యాలరీని కానుకగా ఇచ్చారు. బైడన్ పర్సనల్ గా మోదీకి ఓ అమెరికన్ కెమేరాను బహుమతిగా అందించారు. దీంతో పాటుగా జార్ట్ ఈస్ట్ మెన్ మొదటి కొడాక్ కెమేరా పెటెంట్ ఆర్వైవల్ ఫాక్సిమైట్ ప్రింట్, అమెరికన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ హార్డ్ కవర్ పుస్తకాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు.

PM Modi gifts a lab-grown 7.5-carat green diamond to US First Lady Dr Jill Biden on his first state visit to US

జిల్ బైడెన్ ప్రధాని మోదీకి రాబర్ట్ ఫ్రాస్ట్ కవితల సంకలన సంతకం మొదటి ఎడిషన్ కాపీని గిఫ్ట్ గా అందించారు. భారత్ తో అనుబంధం ఉన్న ఐరిష్ రచయిత.. నోబెల్ విన్నర్ యేట్స్ భారత ఉపనిషత్తుల ఇంగ్లీషు తర్జుమా కాపీని అందచేసారు. యేట్స్ 1923 లో సాహిత్య రంగంలో నోబెల్ అందుకున్నారు.

జిల్ బైడెన్ కు గిఫ్ఠ్ గా వజ్రం:
ప్రధాని మోదీ అమెరికా ప్రధమ మహిళ జిల్ బైడెన్ కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ గ్రీన్ డైమండ్ పర్యవరణ అనుకూలమైంది. సోలార్, విండ్ పవర్ లాంటి వనరులతో దీనిని రూపొందించారు. శ్వేత సౌధంలో తనకు అందిన ఆతిథ్యం పైన ప్రధాని మోదీ స్పందించారు.

తాము అనేక విషయాల పైన మాట్లాడుకున్నట్లుగా ట్వీట్ చేసారు. అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అదే విధంగా అమెరికన్ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశంలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. దీని పైన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అదే విధంగా ప్రవాస భారతీయుల సమావేశంలోనూ ప్రధాని మోదీ పాల్గొంటారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+