లడఖ్ రూపురేఖలు మార్చేసిన మోదీ.. లేహ్ ఎయిర్‌పోర్ట్‌లో వినూత్న టెక్నాలజీ!

భారత సరిహద్దు ప్రాంతమైన లడఖ్ అభివృద్ధి ప్రయాణంలో ఒక మహోన్నత అధ్యాయం నమోదైంది. రూ. 3,350 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఐదు కీలకమైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేశారు. విమానాశ్రయాల ఆధునీకరణ, వ్యూహాత్మక రహదారుల నిర్మాణం, హరిత ఇంధన ప్రాజెక్టులు, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, జల భద్రత వంటి అనేక అంశాలు ఈ ప్రాజెక్టులలో దాగి ఉన్నాయి. లడఖ్ ప్రజలకు రవాణా, విద్యుత్, తాగునీరు వంటి నిత్యావసర సదుపాయాలను సులభతరం చేయడమే కాకుండా, స్థానిక పురాతన వారసత్వాన్ని కాపాడటంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

రూ. 640 కోట్లతో అత్యాధునిక ఎయిర్‌పోర్ట్ టెర్మినల్..

ప్రారంభమైన ప్రాజెక్టులలో అత్యంత ప్రధానమైనది లేహ్‌లోని కుషోక్ బకూలా రింపోచే విమానాశ్రయం నూతన ప్యాసింజర్ టెర్మినల్. సుమారు రూ. 640 కోట్ల వ్యయంతో, 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టెర్మినల్ ద్వారా వార్షికంగా 35 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. లడఖ్‌లోని తీవ్రమైన చలి పరిస్థితులను తట్టుకునేందుకు భారతదేశంలోనే తొలిసారిగా 'జియోథర్మల్' (భూఉష్ణ) సాంకేతికతతో పాటు సౌరశక్తిని ఈ టెర్మినల్ నిర్మాణంలో ఉపయోగించడం విశేషం. దీనివల్ల విమానాల రాకపోకలు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని ప్రధాని తెలిపారు.

PM Modi Inaugurates Major Development Projects Worth Rs 3350 Crore for Ladakh s Strategic Growth

వ్యూహాత్మక నిమ్మూ-పదుమ్-దార్చా రహదారి..

సరిహద్దు భద్రత, స్థానిక రవాణా వ్యవస్థను మెరుగుపరచేందుకు సరిహద్దు రహదారుల సంస్థ (BRO) నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్మూ-పదుమ్-దార్చా రహదారిని ప్రధాని ప్రారంభించారు. ప్రసిద్ధ జాన్స్కర్ లోయ గుండా సాగే ఈ రహదారి లేహ్‌లోని నిమ్మూను, హిమాచల్ ప్రదేశ్‌లోని దార్చాతో అనుసంధానిస్తుంది. ఇది భారత సాయుధ బలగాలకు వ్యూహాత్మక రవాణా సదుపాయాన్ని వేగవంతం చేయడమే కాకుండా, స్థానిక ప్రజలకు విద్యా, వైద్య, మౌలిక వసతులను వేగంగా చేరుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో సుదీర్ఘ సొరంగం!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో సుదీర్ఘ సొరంగం!

విద్యుత్ లోటుకు చెక్.. 'హిమ్ సరోవర్' ద్వారా జల భద్రత!

లడఖ్ ప్రాంతంలో విద్యుత్ కొరతను తీర్చేందుకు 9 మెగావాట్ల హాను చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టుతో పాటు 66 కేవీ దహ్-హాను-ఖాల్ట్సీ డబుల్ సర్క్యూట్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు నీటి ఎద్దడిని నివారించడానికి 'ప్రాజెక్ట్ హిమ్ సరోవర్' కింద 40 గ్రామాల్లో అభివృద్ధి చేసిన 40 జలాశయాలను ప్రారంభించారు. ఇవి తాగునీటి ఎద్దడిని తీర్చడమే కాకుండా, వ్యవసాయానికి అనుకూలంగా మారి స్థానిక రైతుల జీవన ప్రమాణాలను పెంచుతాయి.

లద్దాఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం
లద్దాఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం

తొలి పెట్రోగ్లిఫ్ కన్సర్వేషన్ పార్క్.. పురాతన చరిత్రకు స

లడఖ్ చరిత్ర, సంస్కృతిని కాపాడే దిశగా లేహ్‌లోని సింధు ఘాట్ వద్ద భారతదేశంలోనే మొట్టమొదటి 'పెట్రోగ్లిఫ్ కన్సర్వేషన్ పార్క్'ను మోదీ ప్రారంభించారు. ప్రాచీన రాతి శిలాచిత్రాలను పరిరక్షించడం ద్వారా ఈ ప్రాంతపు పురాతన నాగరికతను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. నిర్మాణ రంగానికి కృషి చేసిన ఇంజనీర్లు, కార్మికులు, ప్రత్యేకంగా సరిహద్దు రహదారుల సంస్థ సిబ్బందికి ప్రధాని తన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+