Mahakumbh Mela 2025: ప్రధాని మోదీ రాక - ఈ సారి ప్రత్యేకంగా..!!

Mahakumbh Mela 2025: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మేళా.. మహా కుంభ మేళా కు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల మంది భక్తులు కుంభమేళాకు తరలి వచ్చినట్లు అంచనా. ప్రత్యేకించి ఆరు ముహూర్తాల వేళ భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి అమిత్ షా సైతం కుంభమేళాకు వచ్చే ముహూర్తాలు ఖరారయ్యాయి. ప్రధాని రాక వేళ కుంభమేళా లో ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

కుంభమేళా లో భక్తుల రద్దీ పెరుగుతోంది. తొలి రోజు నుంచే భక్తుల సంఖ్య అంచనాలకు మించి కనిపిస్తోంది. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ కుంభ మేళాలో దాదాపు 40 కోట్ల మంది పాల్గొంటారని అంచనాగా ఉంది. త్రివేణీ సంగమం వద్ద భక్తులకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. ఎక్కడా ఫిర్యాదులకు అవకాశం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. భారీ భద్రత మధ్య కుంభమేళా కొనసాగుతోంది. యూపీ సీఎం యోగి తన ప్రభుత్వంలోని మంత్రులతో కలిసి కుంభమేళాలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా 13 వేలకు పైగా ప్రత్యేక రైళ్లను ప్రయాగ్ రాజ్ కు ఏర్పాటు చేసారు. కొన్ని రాష్ట్రాల బస్సు సర్వీసులు ప్రారంభించారు.

PM Modi Likely To Visit Mahakumbh On Feb 5 Shah Set For Holy Dip On Jan 27 as reports

ఇక, రాష్ట్రపతి .. ఉప రాష్ట్రపతి, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుంభమేళా కు వచ్చే తేదీలు ఖరారయ్యాయి. ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న ప్రయాగ్ రాజ్ కు రానున్నట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో మోదీ పాల్గొంటారు. ఇందు కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజున ఢిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న రాష్ట్రపతి ముర్ము ప్రయాగ్ రాజ్ ను సందర్శిస్తారు. అక్కడ జరిగే పలు ప్రధాన కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. ఫిబ్రవరి 1న ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మహా కుంభమేలాలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ రానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

జనవరి 27న జరిగే మహా కుంభమేళలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. షా అక్కడ సంగమంలో పవిత్ర స్నానం చేయనున్నారు. గంగపూజ నిర్వహించి అధికారులతో సమావేశం కానున్నారు. ఇక.. ఈ నెల 26వ తేదీ.. మౌని అమావాస్య, వసంత పంచమి ముహూర్తా ల వేళ జనం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో, అధికారులు ప్రత్యేక ఏర్పాట్ల పైన ఫోకస్ చేసారు. సీఎం యోగీ నిరంతరం కుంభమేళా నిర్వహణ.. భక్తుల సమస్యలు.. ఏర్పాట్ల పైన సమీక్ష చేస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+