నెహ్రూ, ఇందిరల తర్వాత.. మోడీ మూడో ప్రధాని: రామచంద్ర గుహ

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అత్యంత విజయవంతమైన మూడో ప్రధాని కాబోతున్నారని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహా చెప్పారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత మోడీనే విజయవంతమైన ప్రధాని అన్నారు.

మోదీ చరిష్మా, ఆకర్షణీయత, మతం, భాష అనే హద్దులను కూడా చెరిపేస్తోందన్నారు. ఢిల్లీలో జరిగిన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ ఇండియా సమావేశం 2017 కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్ర గుహా తన ప్రసంగంలో మోడీని ప్రశంసించారు.

రెండాకులు-విద్యుత్ స్తంభం: పన్నీరువర్గంపై శశికళ వర్గం గుర్రు

PM Modi set to become India’s third most successful PM: Ramachandra Guha

మోడీ తన నిర్ణయాలు తీసుకునే అధికారం, ముందుచూపు వల్లే ఆ స్థాయికి వెళ్లారన్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత ఆ స్థాయిలో అధికారం, చరిష్మా, కుల మత భాషా బేధాలు లేకుండా ప్రజలను ఆకర్షించిన భారత ప్రధాని ఎవ్వరూ లేరన్నారు.

భారత రాజకీయ చరిత్రలో కుల వ్యవస్థ, మహిళలపై వివక్ష అనేవి తిరస్కరించలేని రెండు కీలక అంశాలని రామచంద్ర గుహ తెలిపారు. హిందూ, ముస్లిం రెండు మతాల్లోనూ మహిళలపై వివక్ష కొనసాగిందన్నారు. హిందువుల కుల వ్యవస్థ అత్యంత కఠినమైనదన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Narendra Modi is all set to become the third “most successful” Prime Minister of India after Jawaharlal Nehru and Indira Gandhi, celebrated historian Ramachandra Guha has said, asserting that the 66-year-old leader’s “charisma” and “appeal” transcend the boundaries of caste and language.
Please Wait while comments are loading...