కాంగ్రెస్ ఔట్ డేటెడ్ ! ఉత్తరాది, దక్షిణాది విభజనకు ప్లాన్ ! మోడీ కామెంట్స్...
దేశంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలపై ప్రధాని నరేంద్రమోడీ మరోసారి విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఇవాళ ప్రసంగించిన ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఓ ఔట్ డేటెడ్ పార్టీ అంటూ మోడీ వ్యాఖ్యానించారు.
దక్షిణాది, ఉత్తరాది మధ్య విభజన తెస్తోందంటూ మోడీ విమర్శలు గుప్పించారు. తాజా ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి పచ్చిన నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ అధినేత మల్లిఖార్జున ఖర్గే టార్గెట్ గా పలు విమర్శలు గుప్పించారు. తాము మీ (ఖర్గే) ప్రతి మాటను చాలా ఓపికగా, వినయంతో వింటున్నామమని, కానీ ఈ రోజు కూడా మీరు వినకూడదని ప్రిపేర్ అయి వచ్చారని మోడీ విమర్శించారు. కానీ మీరు నా గొంతును అణచివేయలేరని, ఈ స్వరానికి దేశ ప్రజలు బలం చేకూర్చారని, అందుకే ఈసారి పూర్తిగా ప్రిపేర్ అయ్యానని మోడీ వ్యాఖ్యానించారు.
कांग्रेस पार्टी सोच से भी outdated हो गई है।
— BJP (@BJP4India) February 7, 2024
जब सोच ही outdated हो गई है, तो इन्होंने अपना कामकाज भी आउटसोर्स कर दिया है...
- पीएम श्री @narendramodi
पूरा वीडियो देखें: https://t.co/XmgzX1fkjm pic.twitter.com/czFPSuHfNU
బీజేపీకి ఈసారి 400 సీట్లు వచ్చేలా ఖర్గే ఆశీర్వదిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కాపాడుకుంటే చాలని ప్రధాని మోడీ తెలిపారు. పశ్చిమబెంగాల్లో మిత్రపక్షమే కాంగ్రెస్ 40 సీట్లకు పరిమితం అవుతుందని చెప్పేసిందని, అది నిజం కావాలని కోరుకుంటున్నట్లు మోడీ పేర్కొన్నారు. రాజ్యసభలో ఇద్దరు స్పెషల్ లీడర్లు లేకపోవడం వల్లే మల్లిఖార్జున ఖర్గేకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం దొరుకుతుందని అజాద్, ఆనంద్ శర్మను ఉద్దేశించి మోడీ వ్యాఖ్యలు చేశారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!!











Click it and Unblock the Notifications