రేపు పట్టాలెక్కనున్న మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్

గువాహటి: దేశంలో మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కబోతోంది. రైల్వే మంత్రిత్వ శాఖ దీనికి ముహూర్తాన్ని ఖరారు చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైలును కేంద్ర ప్రభుత్వం దశలవారీగా పట్టాలెక్కిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 18 రైళ్లు వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. కొత్తగా 19వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కోసం అందుబాటులోకి రానుంది.

పశ్చిమ బెంగాల్‌లోని న్యూజల్‌పాయ్‌గురి- అస్సాంలోని గువాహటి మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించిన మొట్టమొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇది. న్యూజల్‌పాయ్‌గురి- గువాహటి మధ్య 410 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 30 నిమిషాల వ్యవధిలో అధిగమిస్తుందీ ఎక్స్‌ప్రెస్. వారంలో ఆరు రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది ఈ సర్వీస్.

PM Modi to flag off the New Jalpaiguri to Guwahati Vande Bharat Expresson May 29

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రధాని ఈ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. దీనికోసం గువాహటిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

గువాహటి నుంచి న్యూజల్‌పాయ్‌గురికి వెళ్లే సర్వీస్‌కు 22227, అక్కడి నుంచి గువాహటికి వచ్చే రైలుకు 22228 నంబర్లను కేటాయించారు. ఈ రైలుతో పాటు 182 కిలోమీటర్ల మేర విద్యుదీకరించిన పట్టాలను కూడా జాతికి అంకితం చేయనున్నారు. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి మరింత ఊతాన్ని ఇచ్చినట్టువుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

22227 నంబర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ న్యూజల్‌పాయ్‌గురి స్టేషన్ నుంచి తెల్లవార జామున 6:10 నిమిషాలకు బయలుదేరుతుంది. 11:40 నిమిషాలకు గువాహటికి చేరుకుంటుంది. అదే రోజు సాయంత్రం గువాహటి నుంచి సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరే నంబర్ 22228 నంబర్ రైలు రాత్రి 10:20 నిమిషాలకు న్యూజల్‌పాయ్‌గురికి చేరుకుంటుంది. కామాఖ్య, న్యూబొంగైగావ్, కోక్రాఝర్, న్యూఅలీపూర్దార్ స్టేషన్ల మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+