మోదీ.. మళ్లీ మొదలెట్టేరు- అవుట్ అండ్ అవుట్!!
PM Modi visits Gir: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటనలో ఉన్నారు. మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. శనివారం సాయంత్రమే ఆయన గుజరాత్‌కు చేరుకున్నారు. జామ్‌నగర్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం దిగ్జామ్ సర్కిల్ నుండి పియోలెట్ బంగళా వరకు రోడ్ షో నిర్వహించారు.
జామ్‌నగర్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గుజరాత్ మంత్రులు రాఘవ్‌జీభాయ్ పటేల్, ములుభాయ్ బేరా, ఎంపీ పూనంబెన్ మేడమ్, మేయర్‌బెన్ గార్సర్, జామ్‌నగర్ మేయర్ వినోద్‌భాయ్ ఖిమ్‌సూరియా, ఎమ్మెల్యేలు మేఘ్‌జీభాయ్ చావ్డా, గుజరాత్ చీఫ్ సెక్రటరీ రివాబా జడేజా, గుజరాత్ చీఫ్ సెక్రటరీ అక్బా జడేజా, గుజరాత్ చీఫ్ సెక్రటరీ పన్.. తదితరులు స్వాగతం పలికారు.

ఆదివారం నాడు ప్రఖ్యాత సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు ప్రధాని మోదీ. ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా 2025 వైభవంగా ముగిసిన నేపథ్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటిదిగా భావించే సోమనాథ్ ఆలయాన్ని సందర్శించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఈ ఆలయాన్ని సందర్శించారు.
సోమనాథేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు సోమనాథుడిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానంటూ ట్వీట్ పోస్ట్ చేశారు మోదీ. దేశ శ్రేయస్సు, ప్రజలకు ఆయురారోగ్యాల కోసం స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. సోమ్‌నాథ్ ఆలయం- దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, చారిత్రక వారసత్వ సంపదగా అభివర్ణించారు.
నేడు- గిర్ నేషనల్ పార్క్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. ఈ ఉదయం జామ్‌నగర్ సర్క్యూట్ హౌస్ నుంచి నేరుగా కఛ్ జిల్లాకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఛిత్రోడ్‌కు బయలుదేరి వెళ్లారు. గిర్ అభయారణ్యాన్ని సందర్శించారు. 30,000లకు పైగా చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం గలదీ గిర్ నేషనల్ పార్క్. మొత్తం 9 జిల్లాల్లో 53 తాలూాకాలకు విస్తరించిన ఈ అటవీ ప్రాంతానికి ఆసియాటిక్ పులులు, సింహాల సంరక్షణ కేంద్రంగా గుర్తింపు ఉంది.

సోమ్‌నాథ్ నుంచి 43, జునాగఢ్ నుంచి 60, అమ్రేలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గిర్ ఫారెస్ట్. ప్రతి సంవత్సరం వర్షాకాల సీజన్‌లో అంటే జూన్ 16 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు దీన్ని మూసివేస్తుంటారు. 2020 నాటి గణాంకాల ప్రకారం.. ఈ నేషనల్ పార్క్‌లో 674 వరకు సింహాలు ఉన్నాయి.
ఇందులో లయన్ సఫారీ చేశారు ప్రధాని మోదీ. వేటగాడి అవతారంలో కనిపించారు. తలపై హంటింగ్ హ్యాట్, వైల్డ్ లైఫ్ జాకెట్ ధరించారు. కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారాయన. చేతిలో కెమెరాతో ఓపెన్ టాప్ జీప్‌లో ట్రావెల్ చేశారు. దారిలో సింహాలను క్లిక్‌మనిపించారు.












Click it and Unblock the Notifications