సినిమా ఛాన్స్‌లని, అమ్మాయిల పోర్న్ వీడియోలు
కోల్‌కతా: సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మభ్యపెట్టి అమ్మాయిలతో అశ్లీల వీడియోలు తీస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 28 మంది సభ్యులున్న ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం మీడియాకు తెలిపారు.
కోల్‌కతాలోని బిధానగర్‌లోని శాటిలైట్ టౌన్ షిప్ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాలులో పోర్న్ వీడియోలను చిత్రీకరిస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెప్పారు.

సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలను మభ్యపెడుతున్నారని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత వారిని బెదిరించి, భయపెట్టి చిత్రీకరించిన అశ్లీల వీడియోలను పోర్న్ వెబ్ సైట్లలో పెట్టి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. తమకు సమాచారం అందడంతో నిందుతుడు సహా మ్యారేజ్ హాల్ యజమానిని అరెస్టు చేశారు.
సోమవారం సాయంత్రం ఓ పోలీస్ టీం దాడి చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. అరెస్టైన 28 మందిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. ప్రధాన నిందితుడు దర్శకుడిగా చలామణి అవుతూ సినిమాలలో రోల్స్ ఇప్పిస్తామని అమ్మాయిలను మభ్యపెడుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications