దారుణం: రైడ్ పేరుతో లైంగికదాడి.. పోలీసుల హెల్ప్, మనీ తీసుకొని, కంప్లైంట్ తీసుకోకపోగా..
యూపీలో మరో దారుణం వెలుగుచూసింది. మీరట్ జిల్లా నాచండి పోలీస్‌స్టేషన్ పరిధిలో అతిథిగృహానికి శనివారం ఓ అమ్మాయి వచ్చింది. తెలిసిన వ్యక్తితో యువతి రాగా.. అతిథిగృహం యజమాని కుమారుడు చూశాడు. ఇంకేముంది అతనికి అమ్మాయిపై కన్ను పడింది. తనకు తెలిసిన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీస్ రైడ్ అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరింపులకు పాల్పడ్డాలని.. అనంతరం దీన్ని తప్పించేందుకు మీరు సహకరిస్తే ఆ అమ్మాయిపై అత్యాచారం చేయాలని ప్లాన్ వేశాడు.
అతడికి తెలిసిన పోలీసులు అతిథిగృహానికి చేరుకుని ఆ యువతీ యువకులను చూసి ప్రశ్నించారు. దీంతో ఆ యువతి బెదిరిపోయింది. మీ తల్లిదండ్రులకు సమాచారం చెప్తామని బెదిరించడంతో ఆ యువతి కంగారుపడింది. దీన్ని అవకాశంగా తీసుకున్న అతిథిగృహం భవన యజమాని కుమారుడు దీని నుంచి తప్పిస్తా.. నువ్వు నాకు సహకరించాలి అని మెలిక పెట్టాడు. ఆమె అంగీకరించకపోయినా బలవంతంగా అత్యాచారం చేశాడు. వచ్చిన పోలీసులు ఆ అమ్మాయి నుంచి డబ్బులు కూడా తీసుకున్నారు.

యువతి స్థానికంగా ఉన్న నాచండి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు ఎవరూ స్వీకరించలేదు. ఎందుకంటే గెస్ట్‌హౌస్‌కు వచ్చిన పోలీసులు ఈ స్టేషన్‌కు సంబంధించిన వారే కావడం విశేషం. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని సీఐ ప్రేమ్‌చంద్ శర్మ తెలిపారు. పోలీసులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైరయ్యారు. ఎవరూ ఫిర్యాదు చేయడానికి రాలేదని... ఎవరన్నా వస్తే తప్పకుండా ఫిర్యాదు స్వీకరించి.. విచారణ చేపడతామని సీఐ ప్రేమ్‌చంద్ శర్మ తెలిపారు. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలిసిన వారితో కుమ్మక్కై అమ్మాయిపై అఘాయిత్యం జరగగా.. బాధిత యువతి నుంచి పోలీసులు డబ్బులు వసూల్ చేయడం ఆగ్రహం తెప్పిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications