చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కమల్ హాసన్ ఇంటికి భారీ బందోబస్తు, విదేశాల్లో హీరో, రజనీకాంత్ ఎఫెక్ట్, హిందూ!

|
Google Oneindia TeluguNews

చెన్నై: బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ ఇంటికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హీరో కమల్ హాసన్ ఇంటి దగ్గర ఎవ్వరూ ఆందోళన చెయ్యకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. హీరో కమల్ హాసన్ ఇంటి దగ్గరకు హిందూ సంఘ, సంస్థలు రాకుండా పోలీసులు చెన్నైలోని ఆళ్వార్ పేట్ లో అనేక ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.

 కమల్ హాసన్ మాటలు!

కమల్ హాసన్ మాటలు!

హిందువులను కించపరిచి మాట్లాడారని హీరో కమల్ హాసన్ మీద అనేక హిందూ సంఘ, సంస్థలు కోపంగా ఉన్న విషయం తెలిసిందే. హిందువుల్లో ఉగ్రవాదులు ఉన్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హీరో కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలని హిందూ సంఘ, సంస్థలు డిమాండ్ చేశాయి.

 హీరో ఎవరికి!

హీరో ఎవరికి!

కమల్ హాసన్ ఆయన అభిమానులకు హీరో కావచ్చు కాని మాకు కాదని హిందూ సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి. కమల్ హాసన్ ఇంటిని ముట్టడించి ఆందోళన చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తామని హిందూ మక్కల్ కచ్చి పార్టీ హెచ్చరించింది

 పోలీసులు అలర్ట్

పోలీసులు అలర్ట్

హిందూ మక్కల్ కచ్చి పార్టీ హెచ్చరికతో చెన్నై నగర పోలీసులు అలర్ట్ అయ్యారు. చెన్నై నగరంలోని ఆళ్వార్ పేట్ లోని టీటీకే రోడ్డులోని కమల్ హాసన్ ఇంటి దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హీరో కమల్ హాసన్ విదేశాల్లో ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

 క్షమాపణలు చెప్పాలి

క్షమాపణలు చెప్పాలి

హిందువులను అవమానించి మాట్లాడిన కమల్ హాసన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అనేక హిందూ సంఘ, సంస్థలు డిమాండ్ చేశాయి. అయితే హీరో కమల్ హాసన్ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

రజనీకాంత్ ఎఫెక్ట్!

రజనీకాంత్ ఎఫెక్ట్!

హిందూ మక్కల్ కచ్చి పార్టీ మొదటి నుంచి రజనీకాంత్ కు మద్దతు ఇష్తోంది. రజనీకాంత్ కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని అనేక సార్లు హిందూ మక్కల్ కచ్చి పార్టీ చెప్పింది. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేసిన వెంటనే హీరో కమల్ హాసన్ మీద హిందూ మక్కల్ కచ్చి పార్టీ గురి పెట్టింది.

English summary
Police protection for Kamal hassan's house as the informations says that Hindu protection party going to blockade his house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X