సీఎం ఆఫీస్‌లో ఊమెన్ చాందీ లైంగికంగా వేధించారు: సరిత ఫిర్యాదుపై కేసు నమోదు
తిరువనంతపురం: కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఓ ఎమ్మెల్యేపై కేరళ పోలీసులు లైంగిక వేధింపుల కేసును నమోదు చేశారు. 2003 కేరళ సోలార్ స్కాం కేసులో నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.
2012లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఊమెన్ చాంది తన అధికారిక నివాసంలో తనపై లైంగిక దాడి చేశారని, ఓ మంత్రి నివాసంలో వేణుగోపాల్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సరిత ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేశారు. కేసు దర్యాఫ్తు కోసం ప్రత్యేక దర్యాఫ్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

గతంలోనే ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో చాందీ, ఇతరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సీపీఎం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పుడు అది ముందుకు సాగలేదు. చాందీ అప్పుడు హైకోర్టుకు వెళ్లడంతో దానిని కొట్టి వేసింది.
ఇటీవల సరితా నాయర్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌కు మరోసారి ఫిర్యాదుపై విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో చాందీ సహా ఏడుగురుపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. సరితా ఇటీవల మరోసారి ఫిర్యాదు చేసింది. కాగా, ఇది రాజకీయ కుట్ర అని, చట్టపరంగా దీనిని ఎదుర్కొంటామని చాందీ చెప్పారు.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications