lady leader: సాయంత్రం ఇంటికి వెళ్లిన లేడీ లీడర్ ఉరి వేసుకుని ?, కౌన్సిలర్ ఇంట్లో ఏం జరిగింది ?
సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లేడీ లేడీర్ కొంతమందితో కలిసి మాట్లాడింది. తరువాత ఇంటికి వెళ్లిన లేడీ లీడర్ ఆమె ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బెంగళూరు/ హావేరి: రాజకీయాల్లో ఉన్న మహిళ, ఆమె భర్త నిత్యం ప్రజలతో టచ్ లో ఉన్నారు. ఏవైన సమస్యలు ఉంటే స్థానిక ప్రజలు ఆమె ఇంటికి వెళ్లి మా సమస్యలు పరిష్కరించాలని చెబుతుంటారు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లేడీ లేడీర్ కొంతమందితో కలిసి మాట్లాడింది. తరువాత ఇంటికి వెళ్లిన లేడీ లీడర్ ఆమె ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పవర్ ఫుల్ లేడీ కౌన్సిలర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆ పట్టణంలోని ప్రజలు షాక్ అయ్యారు.

రాజకీయాల్లో ఫ్యామిలీ
కర్ణాటకలోని హావేరి జిల్లాలోని రాణిబెన్నూరు పట్టణంలో ఉషా చిన్నికట్టి అలియాస్ ఉషా అనే మహిళ నివాసం ఉంటున్నది. ఉషా భర్త చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నారు. ఉషా కూడా ఆమె భర్తకు రాజకీయాల్లో సహకరిస్తున్నది. గత మునిసిపల్ ఎన్నికల్లో రాణిబెన్నూరు వార్డు నెంబర్ 23వ వార్డు మహిళలకు రిజర్వ్ అయ్యింది.

లేడీ కౌన్సిలర్
రాణిబెన్నూరు పట్టణంలోని వార్డు నెంబర్ 23వ నుంచి పోటీ చేసిన ఉషా భారీ మెజారిటీతో కౌన్సిలర్ గా విజయం సాధించింది. భార్య ఉషా కౌన్సిలర్ అయినా ఆమె భర్త ఎక్కువగా ప్రజల మధ్య ఉంటున్నాడు. ముఖ్యమైన కార్యక్రమాలు, పెద్దలను కలవాల్సిన సమయంలో ఉషా కచ్చితంగా ఆమె భర్తతో కలిసి వెలుతోంది.

సాయంత్రం బయటకు వచ్చింది
రాణిబెన్నూరు పట్టణంలోని వినాయకనగరలో ఉషా దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఉదయం లేడీ కౌన్సిలర్ చాలా మందితో ఫోన్ లో మాట్లాడింది. మధ్యాహ్నం భర్త ఇంటికి రాకపోవడంతో ఆమె ఇంట్లోనే భోజనం చేసింది. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లేడీ కౌన్సిలర్ ఆమె వార్డులోని కొందరు మహిళలతో మాట్లాడి ఇంటికి వెళ్లింది.

రూమ్ లో ఉరి వేసుకున్న మహిళ
సాయంత్రం ఇంటికి వెళ్లిన లేడీ కౌన్సిలర్ ఉషా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఉషా ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. లేడీ కౌన్సిలర్ ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు విచారణలో ఉందని రాణిబెన్నూరు పోలీసులు అంటున్నారు.

ఫోన్లు ఎవరెవరుకు చేశారు ?
ప్రముఖ పార్టీలో చరుకుగా ఉంటున్న ఫ్యామిలీలోని లేడీ కౌన్సిలర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం రాణిబెన్నూరులో కలకలం రేపింది. కొన్ని రోజుల నుంచి లేడీ కౌన్సిలర్ ఉషాకు ఎవరెవరు ఫోన్లు చేశారు. ఆమె ఎవరెవరికి ఫోన్లు చేశారు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అన్నారు. ఇదే సమయంలో లేడీ కౌన్సిలర్ ఉషా కుటుంబ సభ్యులను రాణిబెన్నూరు పోలీసులు విచారించి వివరాలు సేకరిస్తున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications