వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలక్షన్ స్టంట్ : అన్ని రాజకీయపార్టీలు ఆధ్మాత్మికం వైపే.. డేరా బాబాను కూడా..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్నికలవేళ పార్టీలు ఆధ్యాత్మిక గురువుల వైపు చూస్తున్నాయి. ఉత్తరభారతంలో ఆధ్యాత్మికత కాస్త ఎక్కువే. అక్కడ ఆధ్యాత్మిక గురువులు ఓటర్లను కొంతవరకు ప్రభావితం చేయగలరనేది ఉంది. ఇందులో భాగంగానే చాలామంది నాయకులు ఆధ్యాత్మిక గురువుల వైపు చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమకంటే తమకే మద్దతు ఇవ్వాలని కోరుతున్నాయి.

డేరా బాబా కోట్లు పోగేశాడు.. ఈ రెండేళ్లలో కూడబెట్టింది మాత్రం 18 వేలే..!డేరా బాబా కోట్లు పోగేశాడు.. ఈ రెండేళ్లలో కూడబెట్టింది మాత్రం 18 వేలే..!

ఇక హర్యానాలో డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం వైపు కూడా కొన్ని పార్టీలు ఆశ్రయిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. డేరాబాబా ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. అతనిపై అత్యాచారం, హత్య కేసులు నమోదయ్యాయి. డేరా బాబాకు 15 మంది సభ్యులతో కూడిన రాజకీయవ్యవహారాల కమిటీ ఒకటి ఉంది. వీరు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరితే ఆయన భక్తులు ఆ పార్టీకే మద్దతు పలికే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఏ పార్టీకి తమ మద్దతు ఇవ్వాలనే అంశంపై గ్రౌండ్ లెవెల్‌లో చర్చిస్తున్నట్లు పొలిటికల్ వ్యవహారాల శాఖ జోగిందర్ తెలిపారు.

Political parties eyeing on spiritual path seeking support

ఎన్నికలకు ఒక్కరోజు ముందు కూడా తమ మద్దతు ఎవరికో ప్రకటించినా సరిపోతుందని తమ భక్తులు ఫాలో అయిపోతారనే కాన్ఫిడెన్స్‌ను ఆయన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరో ఆధ్యాత్మిక గురువు గురు రామ్‌పాల్ కూడా జైలులో ఉన్నాడు. నవంబర్ 2014 నుంచి ఆయన జైలులో ఉంటున్నాడు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు గురు రామ్‌పాల్ కాంగ్రెస్‌కు తన మద్దతును ప్రకటించాడు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించాడు.

ఇదిలా ఉంటే లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా చూడాలని అన్నారు గురురాంపాల్ మీడియా కార్యదర్శి చాంద్ రతి. అక్టోబర్ 15న తామంతా సమావేశం అవుతున్నట్లు చెప్పిన చాంద్ రతి ఆ తర్వాతే తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోయేది ప్రకటిస్తామని చెప్పారు. రోహ్‌తక్‌లో రాంపాల్‌కు చాలామంది భక్తులున్నారని వీరంతా ఫలితాన్ని ప్రభావితం చేయగలరని రతి చెప్పారు. ఇలా బాబాలు గురువుల ప్రభావం చాలావరకు ఉండటంతో ఆయా పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి.

English summary
A head of Assembly elections all political parties are seeking the support of spiritual Gurus as they have huge followers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X