ఎంబీబీఎస్ విద్యార్థినికి వేధింపులు, ప్రముఖ నటి కుమారుడు అరెస్టు, ఎక్కడపడితే అక్కడ !
యువతిని వేధింపులకు గురి చెయ్యడంతో ప్రముఖ నటి భువనేశ్వరి కుమారుడు మిథున్ శ్రీనివాసన్ (23)ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై: యువతిని వేధింపులకు గురి చెయ్యడంతో ప్రముఖ నటి భువనేశ్వరి కుమారుడు మిథున్ శ్రీనివాసన్ (23)ను చెన్నై నగర పోలీసులు అరెస్టు చేశారు. యువతి ఇంటి దగ్గర, రహదారుల్లో, కాలేజ్ దగ్గర, ఎక్కడపడితే అక్కడ టార్చర్ పెడుతూ నిత్యం వేధింపులకు గురి చేసినందుకు మిథున్ శ్రీనివాసన్ ను అరెస్టు చేశామని చెన్నై పోలీసులు చెప్పారు.
చెన్నైలోని తిరుమలై నగర్ లోని ఏంజల్ వీధిలో ప్రముఖ నటి భువనేశ్వరి నివాసం ఉంటున్నారు. ప్రముఖ నటి భువనేశ్వరి కుమారుడు మిథున్ శ్రీనివాసన్ చెన్నైలోని ఓప్రైవేటు లా కాలేజ్ లో న్యాయశాస్త్రం (ఎల్ఎల్ బీ) విద్యాభ్యాసం చేస్తున్నాడు. చెన్నైలోని తిరుమంగళంలో నివాసం ఉంటున్న యువతి ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది.

ఎంబీబీఎస్ విద్యార్థిని, మిథున్ శ్రీనివాసన్ ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ అయ్యారు. తరువాత ఇద్దరూ కలుసుకుంటూ స్నేహంగా ఉండేవారు. తనను వివాహం చేసుకోవాలని మిథున్ శ్రీనివాసన్ యువతిని వేధింపులకు గురిచేశాడు. మిథున్ శ్రీనివాసన్ ను వివాహం చేసుకోవడానికి యువతి నిరాకరించింది.
రెండు మూడు సార్లు యువతి ఇంటి దగ్గరకు వెళ్లిన మిథున్ శ్రీనివాసన్ పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురి చేశాడు. యువతి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ధ్వంసం చేసి నానా హంగామా చేశాడు. యువతి చదువుతున్న మెడికల్ కాలేజ్ దగ్గరకు వెళ్లి వేధింపులకు గురి చేశాడు.
మిథున్ శ్రీనివాసన్ వేధింపులు ఎక్కువ కావడంతో తాను కాలేజ్ కు వెళ్లనని యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. యువతి కుటుంబ సభ్యులు తిరుమంగళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 354 (B), 448, 427, 506, తమిళనాడు మహిళా వేధింపుల చట్టం సెక్షన్ 4 కింద మిథున్ శ్రీనివాసన్ ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. భువనేశ్వరి ఇంటిలో పని చెయ్యడానికి శ్రీలంక నుంచి తీసుకు వచ్చిన యువతితో మిథున్ శ్రీనివాసన్ కు ఇంతకు ముందే వివాహం చేశారని, తరువాత యువతి కుటుంబ సభ్యులను బెదిరించారని నమోదైన కేసు మద్రాసు హై కోర్టులో విచారణలో ఉంది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications