Music Director Raj: ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత..
టాలీవుడ్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని తన నివాసంలో రాజ్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రాజ్ మరో సంగీత దర్శకుడు కోటి తో కలిసి అనేక చిత్రాలకు సంగీతం అందించారు. రాజ్-కోటి ద్వయం దశాబ్దాల పాటు సంగీతంతో సినీ ప్రేమికులను అలరించింది. ఆ తర్వాత వారు విడిపోయారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు అందించారు.
రాజ్ ఒంటరిగా సంగీతం అందించిన సినిమాల్లో సిసింద్రీ ఉంది. ఆయన అన్ని భాషల్లో కలిపి 455 చిత్రాలకు సంగీతం అందించారు. రాజ్ మరణ వార్తతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజ్ మృతి పట్ల టాలీవుడ్ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.













Click it and Unblock the Notifications