• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ : ఇంట్లో కూర్చుని పోర్న్ వీక్షిస్తున్న ఇండియన్స్.. ట్రాఫిక్ ఏ స్థాయిలో పెరిగిందంటే..

|
Google Oneindia TeluguNews

లాక్ డౌన్.. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్య. వచ్చే ఏప్రిల్ 14వరకు ప్రజలంతా ఇళ్లకు పరిమితం కావాల్సిందే. కానీ చాలామంది ఈ సుదీర్ఘ పీరియడ్‌ని ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు. వైరస్ కంటే ఇంట్లో ఏమీ దిక్కుతోచకుండా కూర్చోవడం వారిని చాలా ఇబ్బందిపెడుతోంది. ఇక భార్యా బాధితులు,భర్తల భాధితుల సంగతి సరేసరి. నిమిషం కూడా ఒకరంటే ఒకరికి పడని భార్యాభర్తలు.. దాదాపు నెలరోజులు ఇంట్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఎలా గడపాలని తలలు బాదుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన జోక్స్,సెటైర్స్ కూడా పడుతున్నాయి. ఇలాంటివారందరికీ ఇంటర్నెట్ ఇప్పుడు పెద్ద వరంలా మారింది. మరి ఇంటర్నెట్‌లో వీళ్లంతా ఏం చూస్తున్నట్టు.. సినిమాలా..? లేక రహస్య వీడియోలా..?

ఇండియా నుంచి 20శాతం పెరిగిన ట్రాఫిక్

ఇండియా నుంచి 20శాతం పెరిగిన ట్రాఫిక్

కరోనా వైరస్ కారణంగా ఇళ్లకే పరిమితమై బోర్‌గా ఫీల్ అవుతున్నవాళ్లలో కొంతమంది 'పోర్న్' వీడియోలను వీక్షిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇండియాలో దాదాపు 857 పోర్న్ సైట్లను నిషేధించినప్పటికీ.. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ సర్వీస్(VPN) లేదా మిర్రర్ సైట్స్ ద్వారా పోర్న్ సైట్స్‌లోకి వెళ్లి వీడియోలను వీక్షిస్తున్నారు. ప్రముఖ అడల్ట్ ఎంటర్టైనర్ సంస్థ xHamster వెల్లడించిన డేటా ప్రకారం.. ఫిబ్రవరితో పోలిస్తే మార్చి నెలలో ప్రతీరోజూ తమ సైట్‌కు ఇండియా నుంచి 20శాతం ఎక్కువ ట్రాఫిక్ వస్తోందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ హాకిన్స్ మంగళవారం(మార్చి 24)న ThePrintకి వెల్లడించారు.

ఇండియన్స్ ఏ కేటగిరీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు..

ఇండియన్స్ ఏ కేటగిరీని ఎక్కువగా ఇష్టపడుతున్నారు..

ఫిబ్రవరి నెల ప్రారంభంలోనే ఇండియా నుంచి తమ సైట్‌కు ట్రాఫిక్ పెరగడం ప్రారంభమైందని.. కానీ గడిచిన రెండు వారాలుగా అది గణనీయంగా పెరిగిందని అన్నారు. ప్రపంచంలోని ఐదు టాప్ అడల్ట్‌ ఎంటర్టైన్‌మెంట్ సైట్లలో తమదీ ఒకటని.. ప్రతీరోజూ దాదాపు 30 మిలియన్ల మంది సైట్‌ను వీక్షిస్తారని తెలిపారు. ఇండియా నుంచి తమ సైట్‌లోకి వచ్చేవారిలో ఎక్కువమంది 'ఇండియన్స్(దేశీ)' వీడియోలను వీక్షిస్తుంటారని చెప్పారు. ఆ తర్వాత స్థానంలో 'ఓల్డ్&యంగ్','మామ్','జపనీస్','పోర్న్ ఫర్ వుమెన్' కేటగిరీలు ఉన్నట్టు హాకిన్స్ తెలిపారు. పోర్న్ విషయంలో దాదాపుగా పురుషులు,మహిళలకు ఒకే రకమైన అభిరుచి ఉందన్నారు. పురుషులు ఎక్కువగా వుమెన్ కంటే మామ్ వీడియోల పట్ల ఆసక్తి చూపుతున్నారని,మహిళలు 'పోర్న్ ఫర్ వుమెన్' ఎక్కువగా వీక్షిస్తున్నారని తెలిపారు.

ఏ దేశం నుంచి ఎంత ట్రాఫిక్ పెరిగింది..

ఏ దేశం నుంచి ఎంత ట్రాఫిక్ పెరిగింది..

ఒక్క xHamster మాత్రమే కాదు లాక్ డౌన్ పీరియడ్‌లో భారత్ నుంచి ఇతర పోర్న్ సైట్లకు కూడా ట్రాఫిక్ పెరిగినట్టు డేటా చెబుతోంది. మార్చి 17వ తేదీ నుంచి పోర్న్ హబ్‌లో వీడియోలను చూసే భారతీయుల సంఖ్య పెరిగిందని సీఎన్‌బీసీ వెల్లడించింది. లాక్ డౌన్ పీరియడ్‌లో పోర్న్ హబ్ యూరోపియన్ దేశాలకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ప్రీమియం వీడియోలను సైతం ఉచితంగా చూసే వెసులుబాటు కల్పించింది. అయితే ప్రీమియం వీడియోలను ఉచితంగా చూసే ఫ్రీ మెంబర్ షిప్ ఆఫర్ లేకుండానే భారత్ నుంచి కూడా ట్రాఫిక్ 18శాతం ట్రాఫిక్ పెరిగింది. భారత్ కంటే హాంకాంగ్ 23.4శాతంతో ముందు స్థానంలో ఉంది. ఇక పోర్న్ హబ్ ఆఫర్ తర్వాత ఇటలీ,ఫ్రాన్స్,స్పెయిన్‌లో సగటున ఒకరోజుకు వరుసగా 57శాతం,38శాతం,61శాతం ట్రాఫిక్ పెరగడం గమనార్హం. ఇటీవల మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా పోర్న్ హబ్ ట్రాఫిక్ 11.6శాతానికి చేరింది. అదేరోజు మధ్యాహ్నం అత్యధికంగా 26.4శాతానికి చేరింది.

Recommended Video

  Janatha Curfew:European Countries Are Already implementing what Modi Said To D On Marc 22nd
  నెదర్లాండ్‌ నుంచి ఏకంగా 14శాతం

  నెదర్లాండ్‌ నుంచి ఏకంగా 14శాతం


  2019లో ప్రపంచంలోనే అత్యధికంగా 42 బిలియన్ల సార్లు నెటిజెన్స్ సందర్శించిన సైట్‌గా పోర్న్ హబ్‌ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా చాలాదేశాల్లో లాక్ డౌన్ కారణంగా ఎక్కువమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండటంతో పోర్న్ ట్రాఫిక్ పెరిగింది. మార్చి 17న అమెరికా నుంచి సాధారణ రోజుల్లో కంటే 6శాతం ఎక్కువ ట్రాఫిక్ పెరిగింది. కెనడా,బ్రిటన్ నుంచి ఫిబ్రవరి నెలాఖరికి సాధారణ రోజుల్లో కంటే 2శాతం ట్రాఫిక్ పెరిగింది. గత రెండువారాల్లో నెదర్లాండ్‌లో ఏకంగా 14శాతం ట్రాఫిక్ పెరిగింది. మొత్తం మీద లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమైనవారు.. ఇలా పోర్న్ సైట్ల వీక్షణతో కాలక్షేపంతో చేస్తున్నారన్నమాట. త

  English summary
  The coronavirus pandemic has driven people into their homes, but some have found a way to beat the boredom with a choice pastime — watching porn, that too desi
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X