కౌంటింగ్ ప్రారంభం ..ఎక్కడ ఎన్ని సీట్లు కావాలి : పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు.!!
దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయిదు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభించారు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కావటంతో..పార్టీలు వాటికి అనుగుణంగా లెక్కలు వేసుకుంటున్నారు. టైట్ ఫైట్ ఉండే చోట పట్టు నిలబెట్టుకొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాల పైన ఫోకస్ పెట్టారు. గోవా..ఉత్తరాఖండ్ లో హంగ్ ఏర్పాడే అవకాశం ఉందనే అంచనాలతో ముందస్తుగానే క్యాంపు రాజకీయాలు ప్రారంభించారు. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలను లెక్కిస్తారు.
ఆపై కొన్ని గంటల్లోనే ఓటింగ్ సరళి తెలిసిపోనుంది. మధ్యాహ్నం నాటికి ఫలితాలపై స్పష్టత వచ్చేస్తుంది. రాత్రికల్లా పూర్తి ఫలితాలు వస్తాయి. గరిష్టంగా యూపీలో 750 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు. పంజాబ్‌లో 200 హాల్స్ సెటప్ చేశారు. ప్రతీ హాల్ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక, యూపీలో ఎగ్జిట్ పోల్స్ తరువత సైతం రాజకీయంగా ఆరోపణలు కంటిన్యూ అవుతున్నాయి. ఈవీఎంల పైన ఎస్పీ ఫిర్యాదులు చేస్తోంది. ఇక, అయిదు రాష్ట్రాల్లోనూ అధికారం దక్కించుకోవాలంటే ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్స్ పైనే అందరూ లెక్కలు వేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 403 స్థానాలు ఉండగా..అధికారం దక్కించుకోవాలంటే 202 స్థానాలకు చేరుకో వాల్సి ఉంటుంది. పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది.

Recommended Video
పంజాబ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ 59 సీట్లు కావాలి. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలు ఉన్నాయి, అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు దక్కించుకోవాల్సి ఉంది. అయితే, అక్కడ హంగ్ కు ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. 2017 ఎన్నికల తరువాత అధికార మార్పిడి సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఈ సారి ప్రధాన పార్టీలు ముందుగానే జాగ్రత్త పడుతున్నాయి. ఇక్కడ 31 సీట్లు దక్కించుకోవాల్సి ఉంటుంది. చివరగా గోవాలోనూ ఈ సారి ప్రధాన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 40 సీట్లు ఉన్న గోవా అసెంబ్లీలొ 21 సీట్లు దక్కించుకుంటే ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ - బీజేపీ తమ కీలక నేతలను రాష్ట్రంలో మొహరించింది. పోస్టల్ బ్యాలెట్ లో తాజాగా అందుతున్న ఫలితాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ కు దగ్గరగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications