లైంగిక పటుత్వ పరీక్ష: స్వామి నిత్యానంద మగాడే?
బెంగళూరు: వివాదాస్పద స్వామీజీ, బిడది ధ్యానపీఠాధిపతి నిత్యానంద స్వామి పురుషుడేనని లైంగిక పటుత్వ పరీక్షల్లో తేలినట్లు సమాచారం. అతనికి ఎట్టకేలకు బెంగళూర్‌లోని విక్టోరియా ఆస్పత్రిలో సోమవారం సుదీర్ఘంగా పురుషత్వ పరీక్షలు జరిగాయి. మహిళపై అత్యాచారం చేసినట్టు నిత్యానందపై ఆరోపణలున్నాయి.
కేసుల విచారణ సందర్భంగా తాను పురుషుడినే కానని, అత్యాచారం చేసేంత సామర్థ్యం తనకు లేదని నిత్యానంద కోర్టుకు విన్నవించిన నేపథ్యంలో పురుషత్వ పరీక్షలకు తెర లేచింది. పురుషత్వ పరీక్షలపై ఆదేశాలను రద్దు చేయించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించిన నిత్యానందకు హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఎదురు దెబ్బ తగిలింగి.
పురుషత్వ పరీక్షలకు హాజరుకావాల్సిందేనని హైకోర్టు, సుప్రీంకోర్టు తేల్చిచెప్పాయి. దీంతో పురుషత్వ పరీక్షలకు నిత్యానంద హాజరుకాక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సోమవారం నిత్యానంద వ్యక్తిగత న్యాయవాదులతో పరీక్షలకు హాజరయ్యారు.

ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ దుర్గణ్ణ పర్యవేక్షణలో వివిధ విభాగాల నిపుణులు నిత్యానందకు ఉదయం నుంచి సాయంత్రం దాకా పరీక్షలు చేశారు. మనోవ్యాధి నిపుణుడు నిత్యానంద నుంచి 18 ప్రశ్నలకు సమాధానాలను సేకరించారు.
నిత్యానందకు రక్త, చెమట, ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. అతడి శరీరంలోని అన్ని అవయవాలను పరీక్షించిన వైద్యులు అన్నీ దృఢంగానే ఉన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. వీర్యం సేకరించే విషయంలో న్యాయవాదులకు, సిఐడి అధికారులకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. తప్పనిసరిగా వీర్యం ఇవ్వాల్సిందేనన్న సిఐడి వాదనతో ఆయన వీర్యం ఇచ్చారు.
మడివాళలోని ఎఫ్‌ఎస్‌ఎల్ కేంద్రం నిపుణులుధ్వని పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఒకటి, రెండు రోజుల్లో సీఐడీ అధికారులకు అందజేస్తామని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications