చిన్నారి పెళ్లి కూతురు ఫేమ్ ప్రత్యూష ప్రియుడికి ఊరట

ఢిల్లీ: చిన్నారి పెళ్లి కూతురు టీవీ సీరియల్ ఫేమ్, టీవీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు రాహుల్‌ రాజ్‌సింగ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ముందస్తు బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీం కోర్టు సోమవారంనాడు నిరాకరించింది. రాహుల్ గతంలోనే బొంబాయి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు.

తన కూతురు మరణానికి కారకుడైన రాహల్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వరాదంటూ ప్రత్యూష తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ మహారాష్ట్ర పోలీసులు దరఖాస్తు ఏదైనా చేశారా అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఆరా తీసింది.

Pratyusha Banerjee suicide case: SC rejects her mother’s plea to cancel Rahul Raj’s bail

మహారాష్ట్ర పోలీసులు అటువంటి దరఖాస్తు ఏదీ దాఖలు చేయలేదని ప్రత్యూష తల్లి తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలనే ఆమె పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలనే ఆమె విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ముంబై శివార్లలోని బంగూర్‌నగర్‌లో ఉన్న సొంత ఫ్లాట్‌లో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్న విషయం తెలిసిందే. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సిద్ధార్థ్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ప్రత్యూష మరణానికి గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని, విచారిస్తున్నామని ముంబై పోలీసులు అప్పట్లో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+