"ప్రతి 100 మంది అమ్మాయిల్లో ఇద్దరే పవిత్రం"
ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర కు చెందిన ప్రముఖ గురువు ప్రేమానంద్ మహారాజ్ నేటి తరం యువతపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం యువత తప్పుదారి పడుతున్నారని ఆయన అన్నారు. అనేక రకాల వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని తెలిపారు. ఈ మేరకు అమ్మాయిలపై షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రతి 100 మంది అమ్మాయిల్లో ఇద్దరు లేదా నలుగురు మాత్రమే పవిత్రం.. అని మిగతా వారంతా తమ బాయ్ ఫ్రెండ్స్ తో అఫైర్స్ లో బిజీగా ఉంటున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నలుగురు అబ్బాయులను కలిసిన అమ్మాయి.. మంచి కోడలు ఎలా అవుతుంది.. నలుగురు అమ్మాయిలతో తిరిగిన అబ్బాయి మంచి భర్త ఎలా అవుతాడు అని ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాలంలో అనేకమంది కపుల్స్ పెళ్లయిన వెంటనే విడిపోవడానికి ఇవే కారణాలు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆయన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దేశ వ్యాప్తంగా ఉన్న సాదువులు, గురువులు స్పందించారు. సాదువులు సమాజానికి సరైన మార్గదర్శకంగా ఉంటారని అన్నారు. ప్రేమానంద్ మహారాజ్ వ్యాఖ్యలు సరైనవేనని అభిప్రాయపడ్డారు. సమాజానికి దిక్సూచిగా సాదువులు వ్యవహరిస్తారని తెలిపారు.
Swami Premanand Ji Maharaj says, "In today's era, only 2 to 4 out of every 100 girls maintain purity."#premanandjimaharaj pic.twitter.com/nDMb0EJm1V
— Team Hindu United (@TeamHinduUnited) July 29, 2025
ప్రముఖ సాధువు మహంత్ రాజు దాస్ మాట్లాడుతూ.. ప్రేమానంద్ మహారాజ్ మాట్లాడిన విషయాల్లో తప్పులేదని.. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలనే ఆయన తెలిపారని అన్నారు. ప్రజలు ప్రస్తుతం సగం సగం బట్టలతో రూడ్లపై తిరుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మహిళా శక్తిని మనం ఆరాధిస్తాం. కానీ వీళ్లు సగం బట్టలతో తిరుగుతున్నారు. అని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు మరో ప్రముఖ గురువు శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ప్రేమానంద్ మహారాజ్ కు బృందావన్ లో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళనకరం. ప్రేమానంద్ ప్రసంగాలు లక్షలాది మంది చూస్తారు. అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే ఉత్తమం. అని అన్నారు. మరోవైపు ప్రేమానంద్ వ్యాఖ్యలపై యువత స్పందిస్తూ.. ఇలాంటి వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల ప్రేమానంద్ మహారాజ్ ప్రసంగిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి 100 మంది అమ్మాయిల్లో ఇద్దరు లేదా నలుగురు మాత్రమే పవిత్రం. మిగతా వారంతా బాయ్ ఫ్రెండ్ తో అఫైర్స్ తో బిజీగా ఉన్నారు. ఒక అబ్బాయి పెళ్లికి ముందే నలుగురు అమ్మాయిలతో రిలేషన్ ఉంటే అతడు మంచి భర్త ఎలా అవుతాడు. అతడు వివాహేతర సంబంధాలకు అలవాడు పడ్డాడు. ఈ విధానం అమ్మాయిలకూ వర్తిస్తుంది. అని ప్రేమానంద్ మహారాజ్ తెలిపారు.












Click it and Unblock the Notifications