Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బర్త్‌డే నాడే కంటతడి పెట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీడియో వైరల్

President Droupadi Murmu: నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 67వ పుట్టినరోజు. ప్రస్తుతం రాష్ట్రపతి 3 రోజుల డెహ్రాడూన్ పర్యటనలో ఉన్నారు. పుట్టిన రోజు సందర్భంగా ఆమె డెహ్రాడూన్‌లోని జాతీయ దృష్టి దివ్యాంగజన సాధికారత సంస్థ విద్యార్థులతో కొంత సమయం గడిపారు. ఆమె దివ్యాంగ విద్యార్థులతో సంభాషించారు. ఈ క్రమంలో అంధ విద్యార్థులు ఆలపించిన గీతాన్ని విని ద్రౌపది ముర్ము భావోద్వేగానికి లోనయ్యారు. దృష్టి లోపం గల విద్యార్థులు రాష్ట్రపతి కోసం పుట్టిన రోజు పాట పాడడంతో ఆమె భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది ఆమెకు టిష్యూ పేపర్ అందించగా.. దానితో ఆమె కన్నీళ్లు తుడుచుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కార్యక్రమంలో గవర్నర్ గుర్మీత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా పాల్గొన్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.."నా ప్రజా జీవితంలో అత్యంత హత్తుకునే క్షణాల్లో ఒకటి. కల్మషం లేని చిన్నారుల స్వరం, వారి బలం, స్ఫూర్తి దేశ నిజమైన ఆత్మను ప్రతిబింబిస్తుంది" అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

President Droupadi Murmu Breaks Down on Her Birthday Emotional Video Goes Viral

రాష్ట్రపతి పర్యటన విశేషాలు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటన నిమిత్తం డెహ్రాడూన్ చేరుకున్నారు. ఆమె ప్రజల కోసం రాష్ట్రపతి నికేతన్‌ను ప్రారంభించనున్నారు. అలాగే, రాష్ట్రపతి పార్కుకు శంకుస్థాపన చేసి, రాష్ట్రపతి నికేతన్ జీవవైవిధ్యంపై ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేయనున్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొననున్నారు.

రాష్ట్రపతికి అభినందనలు తెలిపిన ప్రముఖులు

నేడు రాష్ట్రపతి 67వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు రాజకీయ నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె జీవితం, నాయకత్వం దేశవ్యాప్తంగా కోట్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని అన్నారు. ప్రజా సేవ, సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమెకు ఉన్న అచంచలమైన నిబద్ధత అందరికీ ఆశాకిరణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్‌లో రాహుల్ గాంధీ, "గౌరవనీయులైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి వారి పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు" అని రాశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+