జుట్టు రాలిపోతుంటే ఇలా చేయండి!
పురుషులకైనా, స్త్రీలకైనా పొడవాటి జుట్టు అందాన్ని పెంచుతుంది. పొడవాటి జుట్టుపై సినిమాల్లో ఎన్నో పాటలు ఉన్నాయి. అయితే మహిళల్లో ప్రస్తుత రోజుల్లో పొడవాటి జుట్టు ఉండటంలేదు. దీనికి కారణం.. నెరిసిపోవడం.. రాలిపోతుండటం.. చండ్రు వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. పొడిగా, నిర్జీవంగా ఉండే జుట్టు చాలామందికి ఇబ్బందిగా మారుతుంది. శరీరంలో తగిన పోషకాలు లేకపోవడం, రసాయన ఉత్పత్తులు ఎక్కువగా వాడుతుండటం వల్ల కూడా జుట్టు పెరగడం ఆగిపోతుంది. కెమికల్ ఉత్పత్తులను వాడటం మానేసి జుట్టును సహజంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని నివారణా పద్ధతులను పాటించాలి.
ఆయుర్వేదంలో జుట్టుకు ప్రయోజనకరంగా ఉండే అంశాలు చాలా ఉంటాయి. జుట్టుకు సంబంధించిన సమస్యలను ఇవి తొలగిస్తాయి. ఈ వస్తువులతో చేసిన హెయిర్ మాస్క్ మీ జుట్టు కుదుళ్లను బలంగా చేయడంతోపాటు చుండ్రును తగ్గించి జుట్టు రాలిపోతుండటాన్ని తగ్గిస్తుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం.

పెరుగు - 1 టేబుల్ స్పూన్
డ్రై త్రిఫల - 1 టేబుల్ స్పూన్
వేప పొడి - 1 టేబుల్ స్పూన్
భృంగరాజ్ - 1 టేబుల్ స్పూన్
పొడి అల్లం (పొడి అల్లం) - 1 స్పూన్ చొప్పున తీసుకోవాలి.
వీటన్నింటిని కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. అరగంట సమయం అలాగే ఉంచి తర్వాత జుట్టుకు పట్టించాలి. జుట్టు మూలాల వరకు దీన్ని అప్లై చేసి అలాగే అరగంట సమయం ఉంచి తర్వాత కుంకుడుకా, శీకాకాయతో తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు చొప్పున మూడువారాలు ఇలా చేయాలి. జుట్టు ఊడిపోకుండా మీకు మెరుగైన ఫలితాలు కనపడతాయని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications