మహిళలకు అదిరిపోయే పథకంతో శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ!

భారత ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను అందిస్తూ వారి పురోభివృద్ధికి దోహదం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రత్యేక దృష్టి సారించిన ప్రధాని మోదీ దేశంలోని మహిళలందరికీ శుభవార్త చెప్పారు. ఈరోజు బీమా సఖీ యోజన పథకాన్ని ప్రారంభించారు.

బీమా సఖి యోజన పథకం ప్రారంభించిన పీఎం మోదీ
హర్యానాలోని పానిపట్ లో ఈ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ ఈ పథకం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. వచ్చే మూడు సంవత్సరాల రెండు లక్షల మంది మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకం ద్వారా కృషి చేయనున్నట్టు వెల్లడించారు. బీమా సఖి యోజన పథకం ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ మహిళలకు శిక్షణ మరియు ఉపాధిని కల్పించనుంది.

Prime Minister Modi said super good news with a great scheme bima sakhi yojana for women

బీమా సఖి యోజన పథకం ద్వారా మహిళలకు ఉపాధి
దీని ద్వారా మహిళలు బీమా గురించి తెలుసుకోవడం మాత్రమే కాకుండా ఎల్ఐసి బీమా పాలసీలను ఏ విధంగా అమ్మాలో నేర్చుకుంటారు. వీరికి శిక్షణ ఇచ్చిన తర్వాత బీమా సఖి యోజన పథకం ద్వారా వీరికి ఉపాధిని కల్పిస్తారు. దీని ద్వారా వీరు ఆర్థికంగా ఎదగడానికి దోహదం చేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ పథకంగా బీమా సఖి యోజనను తీసుకువచ్చారు.

ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఇదే
ముఖ్యంగా ఈ పథకం యొక్క ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం. అంతేకాదు వీరికి ప్రతినెలా స్థిరమైన ఆదాయం ఉండేలా చూడడం కూడా ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. దేశవ్యాప్తంగా గ్రామాలలోని పేద మహిళలను గుర్తించి వారందరికీ ఈ పథకం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించి ఆర్థిక భరోసాని ఇవ్వడం కోసం కేంద్రం నిర్ణయం తీసుకుంది.

ఈ పథకంలో చేరాలంటే అర్హతలు ఇవే
ఈ క్రమంలోనే నేడు బీమా సఖి యోజన పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే మహిళల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. వీరంతా పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పథకంలో శిక్షణ పొందే మహిళలకు మొదటి మూడు సంవత్సరాలు స్టైఫండ్ ఇస్తారు. ఆ తర్వాత వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు.

మహిళల ఆర్ధిక స్వావలంబన కోసమే ఈ స్కీమ్
ఈ పథకం ద్వారా మొదటి సంవత్సరం మహిళలు ప్రతినెలా ఏడు వేల రూపాయల వరకు ఆదాయాన్ని పొందుతారు. రెండవ సంవత్సరం 6000 రూపాయలు, మూడవ సంవత్సర 5000 రూపాయలు నెలవారి ఆదాయం లభిస్తుంది. అంతేకాదు వీరికి ప్రోత్సాహకంగా 2000 రూపాయలు కూడా లభిస్తాయి .ఆ తర్వాత వీరు బీమా ఏజెంట్లుగా మారే అవకాశం వస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+