Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రజనీకాంత్, రవితేజతో సినిమాలు, ఆ పార్టీలో చేరిన ప్రముఖ నిర్మాత ?, ఏం జరిగిందంటే !

2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి బాహ్య మద్దతు తెలిపిన మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్ ఈరోజు (శుక్రవారం) అధికారికంగా బీజేపీలో చేరారు. సుమలతతో పాటు క్రికెటర్ దొడ్డ గణేష్, కొప్పల్ మాజీ ఎంపీ శివరామగౌడ్ కమలం జెండా పట్టుకున్నారు. బెంగళూరులోని మల్లేశ్వరంలోని బీజేపీ కర్ణాటక రాస్ట్ర పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది.

బీజేపీ సీనియర్ బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర సమక్షంలో సుమలత అంబరీష్ బీజేపీలో చేరారు. ఇదే కార్యక్రమంలో వేదికపైనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర సుమలతకు అత్యంత సన్నిహితుడు, కన్నడతో పాటు తెలుగులో రవితేజతో పాటు ఇతర హీరోలతో, తమిళంలో రజనీకాంత్ భారీ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్‌కు శాలువా కప్పి సన్మానించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Producer Rock line Venkatesh honored at BJP headquarters in Bengaluru

రాక్‌లైన్ వెంకటేష్ కూడా బీజేపీలో చేరినట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాక్ లైన్ వెంకటేష్ బీజేపీలో చేరుతున్నట్లు ఇంత వరకు ఎక్కడా చెప్పలేదు, అయితే పార్టీ చేరిక కార్యక్రమం వేదికపై రాక్ లైన్ వెంకటేష్ కు బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర స్వయంగా శాలువా కప్పడంతో ఆయన కూడా బీజేపీలో చేరారా అనే ప్రశ్న తలెత్తింది. బీజేపీలో సుమలత చేరిక సందర్బంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత, నటుడు రాక్ లైన్ వెంకటేష్ చాలా హుషారుగా కనిపించారు.

సుమలత అంబరీష్ కుమారుడు అభిషేక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. బీజేపీలో ఎందుకు చేరాను అనే విషయంలో సుమలత అంబరీష్ మాట్లాడుతూ మండ్య జిల్లా సమగ్ర అభివృద్ధే నా మంత్రమని, అందుకే బీజేపీలో చేరానని అన్నారు. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారనే ఆశతో బీజేపీలో చేరానని, మండ్యలోని నా అభిమానులు, తన భర్త, దివంగత అంబరీష్ అభిమానులు, మా శ్రేయోభిలాషులు కోరిక మేరకు బీజేపీలో చేరానని, మండ్య జిల్లా ప్రజల ఆశీస్సులు తనకు ఉండాలని మండ్య కోడలు సుమలత అంబరీష్ అభ్యర్థించారు.

బీజేపీ సీనియర్ల మార్గదర్శకత్వం తనకు ఎప్పుడూ అవసరం అని, తనకు ఇంతకాలం వెంట నిలబడిన బీజేపీ నాయకులకు తన ధన్యవాదాలు అని సుమలత అన్నారు. ప్రధాని మోదీ నా స్ఫూర్తి అని, మోదీజీ నాయకత్వంలో పని చెయ్యాలనే ఆశతో తాను బీజేపీలో చేరుతున్నానని సుమల అంబరీష్ అన్నారు. అయితే ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త రాక్ లైన్ వెంకటేష్ బీజేపీలో చేరారని కర్ణాటకలో జోరుగా చర్చ జరుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+