అధికారులతో పడుకోవాలి, సెక్స్ పాఠాలు, డబ్బులు, మార్కులు, లేడీ ప్రోఫెసర్, 20 నిమిషాలు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో ప్రసిద్ది చెందిన మదురై కామరాజు యూనివర్శిటీ సీనియర్ అధికారులు, ప్రోఫెసర్లకు లైంగిక కోరికలు ఎక్కువ అని, ఆ కోరికలు మీరు తీర్చితే అధిక మొత్తంలో డబ్బుతో పాటు పరీక్షల్లో మంచి మార్కులు వేస్తారని విద్యార్థినిలకు సెక్స్ పాఠాలు చెప్పిన లేడీ అసిస్టెంట్ ప్రోఫెసర్ ఇప్పుడు కష్టాల్లోపడ్డారు. లేడీ ప్రోఫెసర్ నిర్మలా దేవిని విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. విద్యార్థినిలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ముుమ్మరం చేశారు. నిర్మలా దేవి వ్యవహారంలో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

అసిస్టెంట్ ప్రోఫెసర్

అసిస్టెంట్ ప్రోఫెసర్

తమిళనాడులోని విరూద్ నగర్ జిల్లాలోని అరుప్పుకోటైలోని దేవాంగ ఆర్ట్స్ కాలేజ్ లోని మ్యాథమెటిక్స్ డిపార్ట్ మెంట్ విభాగంలో నిర్మలా దేవి అసిస్టెంట్ ప్రోఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. అసిస్టెంట్ ప్రోఫెసర్ గా పని చేస్తన్న నిర్మలా దేవీ విద్యార్థినులను మభ్య పెట్టి వ్యభిచారం ఉచ్చులో దింపడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.

20 నిమిషాలు సెక్స్ పాఠాలు

20 నిమిషాలు సెక్స్ పాఠాలు

నలుగురు విద్యార్థులతో మాట్లాడిన నిర్మలా దేవి మదురై కామరాజు యూనివర్శిటీలోని సీనియర్ అధికారులు సీక్రెట్ గా కాలేజ్ అమ్మాలతో శారీరక సుఖం కోరుకుంటారని, మీకు అవకాశం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకోవాలని నిర్మలా దేవి దాదాపు 20 నిమిషాలు విద్యార్థులకు చెప్పిన ఆడియో క్లిప్పింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది.

డబ్బులు, మార్కులు

డబ్బులు, మార్కులు

మదురై కామరాజు యూనివర్శిటీ సీనియర్ అధికారులకు సీక్రెట్ గా లైంగిక సుఖం ఇస్తే మీకు డబ్బులు ఇస్తారని, అంతే కాకుండా పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తారని, మంచి ఉద్యోగాలు వస్తాయని, ఇలాంటి అవకాశం మీరు వదులుకోకూడదని, ఈ విషయం ఎక్కడా బయటకురాదని, మీరు భయపడాల్సిన అవసరం లేదని అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలా దేవి విద్యార్థినిలకు సెక్స్ పాఠాలు చెప్పారు.

రికార్డు చేసిన అమ్మాయిలు

రికార్డు చేసిన అమ్మాయిలు

తమను వ్యభిచారం రోంపిలోకి లాగడానికి ప్రయత్నిస్తున్న లేడీ అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలా దేవి చెబుతున్న సెక్స్ పాఠాలను విద్యార్థినిలు గుట్టుచప్పుడుకాకుండా మొబైల్ లో రికార్డు చెయ్యడంతో ఇప్పుడు ఆమె వ్యవహారం బట్టబయలు అయ్యింది.

కేసు పెట్టిన విద్యార్థినిలు

కేసు పెట్టిన విద్యార్థినిలు

మదురై కామరాజు యూనివర్శిటీ అధికారులకు లైంగిక సుఖం ఇస్తే మా బ్యాంకు అకౌంట్ లో డబ్బులు వేయిస్తానని, ఎక్కువ మార్కులు వచ్చేటట్లు చూస్తానని అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలా దేవి మభ్యపెట్టారని ఆరోపిస్తూ విద్యార్థినిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం సీరియస్

ప్రభుత్వం సీరియస్

విద్యార్థులను చెడుమార్గంలో పంపించడానికి ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మలా దేవిని అధికారులు సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలా దేవి వ్యవహారంలో కఠినచర్యలు తీసుకుంటామని, ఒక మహిళ అయ్యి అసిస్టెంట్ ప్రోఫెసర్ స్థానంలో ఉంటూ విద్యార్థినిలకు ఇలాంటి మాటలు చెప్పినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు మంత్రి జయకుమార్ హెచ్చరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు

లేడీ అసిస్టెంట్ ప్రోఫెసర్ నిర్మలా దేవి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, మదురై కామరాజు యూనివర్శిటీలో కాలేజ్ అమ్మాయిలతో లైంగిక సుఖం కోరుకుంటున్న అధికారుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు, విద్యార్థినిల కుటుంబ సభ్యులు సోమవారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A day after an audio clip, in which a woman faculty of a college in Aruppukottai allegedly lured four girl students to compromise on morality to get 'certain things done' stormed the social media, protests erupted against her in some parts of the Tamil Nadu state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X