ఘోరం: రాంగ్ రూట్ లో వెళ్లొద్దన్నందుకు.. కత్తి తీసి టెక్కీని పొడిచేశాడు

రాంగ్ రూట్ లో వెళ్లొద్దని వారించిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ఓ బైకర్ కత్తితో పొడిచి పరారైన ఘటన పూణె నగరంలోని ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో జరిగింది.

పూణె: అతడో సాఫ్ట్ వేర్ ఇంజనీర్(27). రోడ్డు మీద ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నది అతడి ఉద్దేశం. అదే అతడి పాలిట శాపంగా మారింది.. ఊహించని ముప్పు తెచ్చిపెట్టింది.

పూణె నగరంలో ఎప్పుడూ బిజీగా ఉండే ఫెర్గూసన్ కాలేజీ రోడ్డులో.. ఓ బైకర్ రాంగ్ రూట్ లో వెళుతుండగా.. అలా వెళ్లొద్దని వారించబోయాడు సదరు టెక్కీ. అంతే.. ఆ బైకర్ తీవ్ర ఆగ్రహంతో హితవు చెప్పబోయిన టెక్కీని కత్తితో పొడిచేశాడు.

ఊపిరితిత్తుల దిగువ భాగంలో కత్తిపోట్లు దిగిన ఆ టెక్కీని స్నేహితులు చికిత్స నిమిత్తం ఓ ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని అక్కడి వైద్యులు తెలిపారు. కత్తి పోటు ఏమాత్రం కాస్త పక్కకి దిగినా అతడి ప్రాణాలు పోయేవని, అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.

Pune techie objects to biker riding on wrong side, stabbed

జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సదరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆసక్తి చూపించకపోయినా.. పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే కత్తితో పొడిచిన మోటార్ సైక్లిస్ట్ అక్కడ్నించి పరారవగా, అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఎలా జరిగిందంటే...

దాడికి గురైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన స్నేహితులతో కలిసి ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వచ్చాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో వాళ్లు బయటికొచ్చి రోడ్డు పక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు.

అదే సమయంలో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ మోటారు సైక్లిస్టు వీళ్లతో గొడవ పడ్డాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆ బైకర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి, ట్రాఫిక్ రూల్స్ పాటించమని హితవు పలికాడు. అప్పటికే వీళ్లని దాటి కొంత ముందుకెళ్లిన సదరు బైకర్ ఈ మాటలు విని వెనక్కి తిరిగొచ్చి కత్తి తీసి టెక్కీ పొట్టలో పొడిచి బైక్ పై పరారయ్యాడు.

అతడి పక్కనున్న స్నేహితులు.. అతడేదో చేత్తో కొట్టి ఉంటాడనుకున్నారేగాని, కత్తితో పొడిచాడని భావించలేదు. గాయంపై అరచేతిని ఉంచుకుని కొంతదూరం వెళ్లి.. వీధి లైట్ల వెలుగులో చూస్తే.. ఇంకేముంది రక్తం స్రవిస్తోంది.

అప్పుడు గాని సదరు బైకర్ తమ స్నేహితుడ్ని కత్తితో పొడిచాడని వారికి అర్థం కాలేదు. దీంతో హుటాహుటిన అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+