వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్ పీఠం కాంగ్రెస్ దే! చేతులెత్తేసిన ఆప్..

తొలిసారిగా ఢిల్లీ బయట బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. అనుకున్న రీతిలో అక్కడ ఫలితాలు సాధించలేక కాంగ్రెస్ చేతిలో చతికిలపడిపోయింది.

|
Google Oneindia TeluguNews

లక్నో: పంజాబ్ లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో పాగా వేసింది. అంచనాలకు మించి రాణిస్తుందనుకున్న ఆప్.. ఆదిలోనే చతికిలపడి గట్టి పోటినివ్వ లేకపోయింది. కొద్దిసేపటి క్రితమే పంజాబ్ లో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది.

ఆయా పార్టీలు సాధించిన సీట్ల వివరాలు:

కాంగ్రెస్-77

ఆప్-20

అకాలీదళ్+బీజేపీ-18

ఇతరులు-2

పుట్టినరోజు నాడే అటు పార్టీతో పాటు తాను కూడా విజయం సాధించి తన సంతోషాన్ని డబుల్ చేసుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ సీఎం అమరీందర్ సింగ్. లంబిలో ఓటమి పాలైన అమరీందర్ సింగ్.. పాటియాలలో 51వేల మెజారిటీతో ప్రత్యర్థి జేజే సింగ్ పై గెలిచారు.

పంజాబ్ 117/117: పంజాబ్ కాంగ్రెస్ హస్తగతం..

-పంజాబ్ లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో పాగా వేసింది. అంచనాలకు మించి రాణిస్తుందనుకున్న ఆప్.. ఆదిలోనే చతికిలపడి గట్టి పోటినివ్వ లేకపోయింది.

-కాంగ్రెస్ -76 సీట్లతో దూసుకెళ్లగా.. ఆప్-23 సీట్లు, శిరోమణి అకాలీదళ్-14 స్థానాలకు పరిమితమయ్యాయి. ఇతరులు-1, బీజేపీ-4 నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.

-ఆప్-30, కాంగ్రెస్-61, శిరోమణి అకాలీదళ్-22, బీజేపీ-0, ఇతరులు-2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

-పంజాబ్ కాంగ్రెస్ హస్తగతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో పోటీలో ఆప్ వెనుకపడి పోతోంది.

-జలాలాబాద్ లో డిప్యూటీ సీఎం సుఖ ్ బీర్ సింగ్(అకాలీదళ్) ముందంజలో ఉన్నారు. జలంధర్ లో కాంగ్రెస్ అభ్యర్థి రింకు గెలుపు. పాటియాలలో అమరీందర్ సింగ్ కు 3500ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

-బీజేపీ ఇంతవరకు ఖాతా తెరవకపోవడం గమనార్హం.

-ఆప్ అభ్యర్థి భగవంత్ మాన్ వెనుకంజలో ఉన్నారు.

-తొలి ఫలితాల్లో కాంగ్రెస్ చేతిలో ఆప్ చతికిలపడినట్లుగానే కనిపిస్తోంది.

-కాంగ్రెస్-26, ఆప్-15, శిరోమణి అకాలీదళ్-8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

-ఆమ్ ఆద్మీ నేత భగవంత్ మాన్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

-అమృత్ సర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

-ఆప్-15, కాంగ్రెస్-21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

-ఆప్ కన్నా ముందంజలో కాంగ్రెస్.. ఆప్-10, కాంగ్రెస్-19, శిరోమణి అకాలీదళ్-4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

-లంబిలో సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

-ఆప్-9 కాంగ్రెస్-6 శిరోమణి అకాలీదళ్-7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

-కాంగ్రెస్-ఆప్ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది.

-పంజాబ్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది..

punjab

ఫలితాలకు ముందు అంచనా:

పంజాబ్ లో మొత్తం 117సీట్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ సాధించాలంటే 59స్థానాల్లో సత్తా చాటాలి. తొలిసారిగా ఢిల్లీ బయట బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ.. అక్కడి ఫలితాలను శాసించే దిశగానే కనిపిస్తోంది. కాంగ్రెస్-ఆప్ మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు తప్పేలా లేదని ఎగ్జిట్ ఫలితాలు తేల్చేశాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో గెలిచి వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకున్న శిరోమణి అకాళీదళ్ కు భంగపాటు తప్పేలా లేదు. బీజేపీతో పొత్తు ఆ పార్టీకి కలిసొచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

మొత్తం మీద అనేకానేక విశ్లేషణల నేపథ్యంలో ఈ ఉదయం 11గం. కల్లా ఎన్నికల ఫలితాలపై ఓ అంచనాకు వచ్చే అవకాశముంది. ఉదయం 8గం.కు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుండగా.. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద వేల సంఖ్యలో సాయుధ బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.er...

English summary
Get live results of Punjab assembly election 2017 where BJP-Akali Dal are ruling. Read latest party-wise election results in Punjab with fastest updates. Check how many seats BJP, SAD, Congress and AAP won in Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X