వైరల్ వీడియో: వీడసలు మనిషేనా.. కన్న కూతురినే..
కన్న తండ్రే ఆ కూతురు పాలిట కాలయముడుగా మారాడు. కూతురుకి వివాహేతర సంబంధం ఉందనే కారణంతో ఆమె ప్రాణాలు తీశాడు. కూతురి చేతులను కట్టేసి కాలువలో తోసేశాడు. ఈ దారుణమైన దృశ్యాలను తన మొబైల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై వారి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Shocking News From Firozpur, Punjab
— زماں (@Delhiite_) October 3, 2025
- A father tied his 19 y/o daughter's hands and threw her into a canal over 'character doubts.'
- She kept screaming for help, but no one saved her.
- The Father has been arrested.
- Her cousin, suspected, followed them and witnessed the… pic.twitter.com/zoeQGvVSjd
అనుమానం పెనుభూతం అయింది. కన్న తండ్రే కూతురిని హతమార్చేందుకు దారి తీసింది. తన కూతురు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకున్న తండ్రిని రాక్షసుడిగా మార్చింది. తన 19 ఏళ్ల కూతురు మరో యువకుడితో తిరుగుతోందని అనుమానం పెంచుకున్న తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కుమార్తె చేతులను కట్టేసి కాలువలో తోసేశాడు. అంతేకాక ఆ భయానక దృశ్యాలను తన మెబైల్ లో చిత్రీకరించాడు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ లో దారుణమైన ఘటన జరిగింది. ఫిరోజ్ పుర్ కు చెందిన సుర్జీత్ సింగ్.. తన 19 ఏళ్ల కుమార్తెపై అనుమానం పెంచుకున్నాడు. తన కుమార్తె గ్రామానికి చెందిన మరో యువకుడితో సంబంధం పెట్టుకున్నట్లు అనుమానించాడు. ఈ క్రమంలో కుమార్తె తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తోందన్న కారణంతో కుమార్తెను హతమార్చాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో రాత్రి తన కుమార్తెను బైక్ పై ఒక కాలువ వద్దకు తీసుకెళ్లాడు. ఆమె చేతులు కట్టేసి.. ఆమెను దారుణంగా కాలువలోకి తోసేశాడు. ఆ అమ్మాయి తల్లి కూడా అక్కడే ఉంది. వాళ్లంతా చూస్తూ ఉన్నారు. కానీ ఎవరూ రక్షించేందుకు యత్నించలేదు. తన కూతురు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం వల్లనే జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీంతో ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.












Click it and Unblock the Notifications