ఘనంగా లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్-ఇషానీల వివాహం, ప్రముఖుల శుభాకాంక్షలు
పనాజి: టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ ఓ ఇంటి వాడయ్యాడు. బుధవారం గోవా వేదికగా తన ఇష్ట సఖి ఇషానీని రాహుల్ మనువాడాడు. 2019 నుంచి డేటింగ్‌లో ఉన్న ఈ జోడీ కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఒక్కటయ్యారు. బెంగళూరుకు చెందిన ఇషాని ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తుండగా, రాహుల్ చాహర్.. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఎంపికయ్యాడు.
Rahul Chahar gets married. Congratulations to him. pic.twitter.com/2pxpy9G0I0
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2022
పంజాబ్ జట్టు రాహుల్‌ను రూ. 5.25 కోట్లకు సొంతం చేసుకుంది. గత సంవత్సరం శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు ఎంపికైన రాహుల్ చాహర్.. వన్డే అరంగేట్రంలో అదరగొట్టాడు. తనకు అవకాశం వచ్చిన ఏకైక వన్డేలో మూడు వికెట్లతో సత్తా చాటాడు. టీమిండియా తరఫున 6 టీ20లు, ఓ వన్డే ఆడిన చాహర్ 7 వికెట్లు తీశాడు.

ఇక ఐపీఎల్‌లో పుణే, ముంబై జట్లకు ఆడిన రాహుల్ చహర్.. 42 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు పడగొట్టాడు. కాగా, రాహుల్ చాహర్, ఇషానీల వివాహానికి రాహుల్ కజిన్ బ్రదర్, టీమిండియా అప్ కమింగ్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ పాటు పలువురు టీమిండియా ఆటగాళ్లు హాజరయ్యారు. మార్చి 12న బెంగళూరులో వీరి రిసెప్షన్ వేడుక జరగనున్నట్లు సమాచారం. కాగా, రాహుల్ చాహర్-ఇషానీ లకు పలువురు క్రీడాకారులు, ప్రముఖులు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
డిసెంబర్ 12, 2021న, వారి ఎంగేజ్‌మెంట్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, రాహుల్ చాహర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన కాబోయే భార్య ఇషానితో ప్రేమతో నిండిన చిత్రాన్ని పంచుకున్నాడు. వారి నిశ్చితార్థ వేడుక నుంచి త్రోబ్యాక్ చిత్రంలో, క్రికెటర్ లేత గోధుమరంగు రంగు సిల్క్ షేర్వానీ సూట్‌ను ధరించాడు, అతని చిరకాల స్నేహితురాలు ఇషాని, భారీగా అలంకరించబడిన, ఫుల్-స్లీవ్ చోలీ, ఒక కలర్-కోఆర్డినేటెడ్ లెహంగాను ఎంచుకున్నారు. దుపట్టా. చిత్రాలతో పాటు రాహుల్ ఇలా రాశారు. "రోజంతా అంతులేని ప్రేమ, ఆప్యాయత, ఆరాధన. నా ప్రేమ వెడ్డింగ్బెల్ సూన్ 2 సంవత్సరాల నిశ్చితార్థ వార్షికోత్సవ శుభాకాంక్షలు" అని పేర్కొన్నాడు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications