హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Pushpa: మేడమ్ స్కెచ్, పుష్పా పార్ట్-4, అల్లు అర్జున్ సినిమా వేస్ట్, మేడమ్ ప్లాన్ వేస్తే ఫినిష్, లెక్క !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి పేరు మీద ఓ మహిళ ట్రస్ట్ ప్రారంభించింది. ప్రభుత్వ పథకాలతో జరుగుతున్న కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని ఆమె పలువురికి చెప్పింది. ఐటీ హబ్ లో కార్యాలయం ఏర్పాటు చేసుకున్న మహిళ నిత్యం పలువురు వ్యాపారులు, కాంట్రాక్టర్లతో ఆమె టచ్ లో ఉంది. ఇదే సందర్బంలో రూ. 7 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని, మీరు వస్తే ఆ విషయం గురించి మాట్లాడుకుందామని ఓ కాంట్రాక్టర్ కు చెప్పింది. మహిళ కార్యాలయానికి వెళ్లిన కాంట్రాక్టర్ తో కొంతసేపు చర్చలు జరిపారు. కొంతసేపటికి ఆ కాంట్రాక్టర్ ను చితకబాదేశారు. తరువాత అక్కడ చాలా కథ జరిగింది. గన్ తో బెదిరించి అతని కాళ్లు, చేతులు కట్టేసి బెండ్ తీశారు. చివరికి ఆ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షలు లాక్కొన్నారు. ఎక్కువ మాట్లాడినా, పోలీసు కేసు పెట్టినా నీ మీద రేప్ కేసు పెడుతానని లేడీ ఢాన్ పుష్పా ఆ కాంట్రాక్టర్ కు వార్నింగ్ ఇచ్చింది. అల్లు అర్జున్ పుష్పా సినిమాను మంచిపోయిన ఈ లేడీ పుష్పా రౌడీషీటర్లను వెంటపెట్టుకుని చేస్తున్న దందాలు, ఆమె స్కెచ్ ల గురించి తెలుసుకున్న బెంగళూరు పోలీసులు బిత్తరపోయారు.

Lady: బాయ్ ఫ్రెండ్ తో ఉంటే మహిళ కిడ్నాప్, 7 మంది సామూహిక అత్యాచారం, ఆంటీ చిక్కిందని మైనర్లు కూడా !Lady: బాయ్ ఫ్రెండ్ తో ఉంటే మహిళ కిడ్నాప్, 7 మంది సామూహిక అత్యాచారం, ఆంటీ చిక్కిందని మైనర్లు కూడా !

 మేడమ్ పేరు పుష్పా

మేడమ్ పేరు పుష్పా

బెంగళూరు నగరంలోని మైసూరు రోడ్డులోని జనతా కాలనీలో పుష్పలత అలియాస్ పుష్పా అనే మహిళ నివాసం ఉంటున్నది. భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలామ్ పేరు మీద పుష్పా ఓ ట్రస్ట్ ప్రారంభించింది. మైసూరు రోడ్డులోని గాలి ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని సాటిలైట్ బస్ స్టాండ్ సమీపంలో పుష్నా ట్రస్టు పేరుతో ఓ కార్యాలయం ప్రారంభించింది.

 వ్యాపారులు, కాంట్రాక్టర్లు టార్గెట్

వ్యాపారులు, కాంట్రాక్టర్లు టార్గెట్

ట్రస్టు కార్యాలయంలో ఎక్కువగా ఉంటున్న పుష్పా అనేక మందితో టచ్ లో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో జరుగుతున్న కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని పుష్పా పలువురికి చెప్పి వారిని మాయమాటతో నమ్మించింది. ఐటీ హబ్ బెంగళూరులో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేసుకున్న పుష్పా పలువురు వ్యాపారులు, కాంట్రాక్టర్లతో టచ్ లో ఉంది.

 టచ్ లోకి వచ్చిన కోటీశ్వరుడు

టచ్ లోకి వచ్చిన కోటీశ్వరుడు

పుష్పాకు బెంగళూరులోని హనుమంతనగర్ లో నివాసం ఉంటున్న రౌడీషీటర్ అయ్యప్ప అలియాస్ అర్జున్, అతని రైట్ హ్యాండ్ సంతోష్ చాలా క్లోజ్ అయ్యారు. రౌడీషీటర్లతో పరిచయాలు పెంచుకున్న పుష్పా దందాలు చెయ్యడం మొదలుపెట్టింది. రెండు సంవత్సరాల క్రితం పుష్పాకు ఓ స్నేహితుడి ద్వారా బెంగళూరులో నివాసం ఉంటున్న కోటీశ్వరుడు, ప్రముఖ కాంట్రాక్టర్ సూరజ్ పరిచయం అయ్యాడు.

 పుష్పా పద్దతి నచ్చకపోవడంతో దూరం అయ్యాడు

పుష్పా పద్దతి నచ్చకపోవడంతో దూరం అయ్యాడు

ఆరు నెలల పాటు పుష్పాతో స్నేహంగా ఉన్న సూరజ్ తరువాత ఆమె పద్దతి నచ్చకపోవడంతో దూరం అయ్యాడు. సుమారు సంవత్సరం నుంచి పుష్పా, సూరజ్ టచ్ లో లేరు. అయితే సూరజ్ కోటీశ్వరుడు కావడంతో అతని దగ్గర భారీ మొత్తంలో నగదు ఉంటుందని పుష్పాకు పక్కా సమాచారం ఉంది.

 రూ. 7 కాంట్రాక్టు పని ఇప్పిస్తామని ?

రూ. 7 కాంట్రాక్టు పని ఇప్పిస్తామని ?

రూ. 7 కోట్ల విలువైన ప్రభుత్వ కాంట్రాక్టు పనులు ఇప్పిస్తానని, మీరు వస్తే ఆ విషయం గురించి మాట్లాడుకుందామని పుష్పా కాంట్రాక్టర్ సూరజ్ కు ఫోన్ చేసి చెప్పింది. సూరజ్ మైసూరు రోడ్డులోని పుష్పా కార్యాలయానికి వెళ్లాడు. కొంతసేపు సూరజ్ పుష్పా మాట్లాడుకున్నారుడ. అదే సమయంలో రౌడీషీటర్ అర్జున్, సంతోష్ అక్కడికి వెళ్లి కాంట్రాక్టర్ సూరజ్ తో కొంతసేపు చర్చలు జరిపారు.

 చితకబాదేసి ఎయిర్ గన్ తో బెదిరింపులు

చితకబాదేసి ఎయిర్ గన్ తో బెదిరింపులు

కాంట్రాక్టర్ సూరజ్ ను కట్టేసిన పుష్పా ఆమె స్నేహితులు రౌడీషీటర్ అర్జున్ ,సంతోష్ తదితరులు చితకబాదేశారు, తరువాత ఎయిర్ గన్ తో సూరజ్ ను చంపేస్తామని బెదిరించిన పుష్పా అతని కాళ్లు, చేతులు కట్టేసి బెండ్ తీసి రూ. 4 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. చివరికి కాంట్రాక్టర్ సూరజ్ స్నేహితుడు నుంచి రూ. 25 లక్షలు లాక్కొన్నారు.

 పుష్పా డీలింగ్ తో షాక్

పుష్పా డీలింగ్ తో షాక్

ఎక్కువ మాట్లాడినా, పోలీసు కేసు పెట్టినా నీ మీద రేప్ కేసు పెడుతానని లేడీ ఢాన్ పుష్పా కాంట్రాక్టర్ సూరజ్ కు వార్నింగ్ ఇచ్చి అతన్ని వదిలేసింది. రెండు రోజుల తరువాత స్నేహితుల సలహాతో సూరజ్ బ్యాటరాయణపుర పోలీస్ స్టేషన్ లో పుష్పా మీద కేసు పెట్టారు. పుష్పాను అరెస్టు చేశామని, రౌడీషీటర్ అర్జున్, అతని స్నేహితుడు సంతోష్ తదితరుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్పా సినిమాను మంచిపోయిన ఈ లేడీ పుష్పా రౌడీషీటర్లను వెంటపెట్టుకుని చేస్తున్న దందాలు, ఆమె స్కెచ్ ల గురించి తెలుసుకున్న బెంగళూరు పోలీసులు బిత్తరపోయారు.

English summary
Pushpa: NGO founder extorted money from businessman by showing air gun in Bengaluru city in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X