రాడికో ఖైతాన్ సంచలనం:"ది స్పిరిట్ ఆఫ్ కశ్మీర్‌"కు జాతీయ అవార్డు..!!

న్యూఢిల్లీ: హిమాలయాల అందాలు, కశ్మీర్ లోయల ఆత్మను ఓ సీసాలో బంధించి తీసుకొచ్చిన రాడికో ఖైతాన్ సంస్థ, విడుదలైన నెలరోజుల్లోనే తమ కొత్త ఉత్పత్తి 'ది స్పిరిట్ ఆఫ్ కశ్మీర్'ద్వారా ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. అత్యున్నత నాణ్యత, అద్భుతమైన తయారీ నైపుణ్యానికి గుర్తింపుగా,ఈ ఉత్పత్తి తన తొలి జాతీయ అవార్డును దక్కించుకొని భారతీయ లగ్జరీ మార్కెట్‌లో సంచలనం సృష్టించింది.

టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన ప్రతిష్టాత్మక 7వ ఐకానిక్ అవార్డ్స్ వేదికగా, నీతి ఆయోగ్ మాజీ సీఈవో, G20 షెర్పా అయిన అమితాబ్ కాంత్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ వేడుక కేవలం విజేతలను సత్కరించడమే కాదు, భవిష్యత్తుకు మార్గదర్శకులైన దూరదృష్టి ఉన్న నాయకులకు, వినూత్నతకు, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇచ్చే బ్రాండ్‌లను గౌరవించింది.

radico-khaitans-the-spirit-of-kashmyr-unveiled-to-national-acclaim-wins-first-award

"ఇది కేవలం ఒక పానీయం కాదు"
ఈ అసాధారణ విజయంపై రాడికో ఖైతాన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమర్ సిన్హా తమ ఆనందాన్ని పంచుకున్నారు. "ది స్పిరిట్ ఆఫ్ కశ్మీర్'కు ఇంత తక్కువ సమయంలోనే గుర్తింపు రావడం నిజంగా మాకెంతో గర్వంగా ఉంది. ఈ ఉత్పత్తి మంచు ముద్దాడిన లోయల స్వచ్ఛతను, పాంపోర్ కుంకుమపువ్వు రాజసాన్ని, తెల్లవారుజామున దాల్ సరస్సులోని ప్రశాంతతను కలిగిన అనుభూతిగా అందిస్తుంది. ఇది కేవలం ఒక పానీయం కాదు, కాశ్మీర్ ఆత్మను వర్ణించే ఒక కవిత. ఈ అపురూపమైన అవార్డుతో, ప్రపంచస్థాయి నాణ్యతను భారతదేశం నుంచి ప్రపంచానికి అందించాలనే మా లక్ష్యం మరింత బలపడింది" అని అన్నారు.

ఒక అవార్డు వెనుక వంద ఏళ్ల చరిత్ర
1943లో రాంపూర్ డిస్టిలరీ కంపెనీగా మొదలైన రాడికో ఖైతాన్, దాదాపు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక నిలకడ కలిగి ఉన్న సంస్థ. ఎన్నో దశాబ్దాలుగా నాణ్యత,వినూత్నత,మరియు అత్యాధునిక తయారీలో నిరంతరంగా పెట్టుబడులు పెడుతూ ఈ సంస్థ ఎదిగింది.దీని ఫలితంగా భారతదేశంతో పాటు 100కు పైగా అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించిన ప్రీమియం బ్రాండ్‌లను సృష్టించగలిగింది.

నేడు, ఈ సంస్థకు రాంపూర్, సీతాపూర్, ఔరంగాబాద్‌లలో భారీ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. వియత్నాం, జింబాబ్వే, బల్గేరియా, గ్రీస్ వంటి పలు దేశాల రాయబారులు పాల్గొన్న ఈ అవార్డుల వేదిక, 'ది స్పిరిట్ ఆఫ్ కశ్మీర్'కు దాని తొలి మైలురాయిని చేరుకోవడానికి సరైన వేదికగా నిలిచింది. ఈ విజయం, ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక వినూత్న వినియోగదారుల సంస్థగా ఒక ప్రత్యేక స్థానాన్ని కట్టబెడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+