శివాలెత్తిన రఘురామ.. ఈ సారి సజ్జలపై రుసరుసలు.. నువ్వు ఆఫ్ట్రాల్ అంటూ ఫైర్
వైఎస్ఆర్ సీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. ఇవాళ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై శివాలెత్తారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ తీరును రఘురామ విమర్శిస్తోన్న సంగతి తెలిసిందే. తనను టార్గెట్ చేసేందుకు సజ్జల మనుషులను నియమించాడని... సోషల్ మీడియలో ఇష్టానుసారం కామెంట్లు చేయిస్తున్నాడని రఘురామ మండిపడ్డారు.

వంద కాల్స్ చేసి టార్చర్
సజ్జల సూచనతో తనకు వంద కాల్స్ వచ్చాయని రఘురామ తెలిపారు. 'తాను ఖాళీగా ఉంటానా జగన్ రెడ్డీ అంటూ ధ్వజమెత్తారు. అంతేకాదు మీ వద్ద కూడా తన మనుషులు ఉన్నారు అని హాట్ కామెంట్స్ చేశారు. బిజ్జల దిశానిర్దేశంతో తనను అసహనానికి గురి చేస్తూ, కేసులు వేద్దామని వాళ్లంతా ప్లాన్ చేశారని అన్నారు. అంతేకాదు తనను ట్రాప్ చేయడానికి ఒక మహిళతో మెసేజ్ పంపిస్తున్నారని రఘురాజు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం పతనావస్థలో ఉందని.. మీ కుట్రలన్నింటినీ త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
తన వ్యక్తిగత కార్యదర్శి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వివరించారు. తనకు ప్రాణహాని ఉందనే విషయాన్ని ఫిర్యాదు లేఖలో తెలిపానని చెప్పారు.
ఆఫ్ట్రాల్ నువ్వొక జర్నలిస్టువి, అనధికార రాష్ట్ర హోం మంత్రిలా వ్యవహరిస్తున్నావని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హోం మంత్రికి ఎలాంటి అధికారాలు లేకుండా చేసి, అన్ని వ్యవహారాలను నువ్వే చూసుకుంటున్నావని మండిపడ్డారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని రఘురామ సవాల్ విసిరారు.
Recommended Video

పిచ్చి పిచ్చి వేషాలు వేయకు
పిచ్చిపిచ్చి వేషాలు వేయకు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించు అని సూచించారు. మీ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయని రఘురాజు హెచ్చరించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనే అహంకారాన్ని పక్కన పెట్టాలని హితవు పలికారు. సీఎం జగన్, సజ్జల ఇద్దరూ వారి పరిధుల్లో ఉండాలని ఉచిత సలహా ఇచ్చారు. మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోవద్దని.. ఏదో ఒకప్పుడు పరిస్థితి మారుతోందని చెప్పారు. అప్పుడు అదే పోలీసులు మీ వెంట పడతారని వివరించారు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications