ఈసీ కార్యాలయానికి రాహుల్ ర్యాలీ.. ! మధ్యలోనే నిర్బంధం..! తీవ్ర ఉద్రిక్తత..!
కర్నాటకతో పాటు పలు రాష్ట్రాల్లో గత ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ఇండియా కూటమి నేతలు ఇవాళ ఢిల్లీలో భారీ ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లేందుకు ర్యాలీగా బయలుదేరారు. అయితే వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఉదయం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన రాహుల్, ఇతర ఇండియా కూటమి ఎంపీలు అక్కడి నుంచి ఓట్ల చోరీపై నిరసన తెలిపేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి భారీగా ర్యాలీగా బయలుదేరారు. ఢిల్లీ రోడ్లపై భారీ ఎత్తున తరలివచ్చిన ఇండియా కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలు, ఎంపీలతో ఈ ర్యాలీ సాగింది. అయితే ఈసీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రాహుల్ సహా ఇతర ఇండియా కూటమి ఎంపీల్ని అదుపులోకి తీసుకున్నారు.

#WATCH | Delhi: Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, "The reality is that they cannot talk. The truth is in front of the country. This fight is not political. This fight is to save the Constitution. This fight is for One Man, One Vote. We want a clean, pure voters… pic.twitter.com/Aj9TvCQs1L
— ANI (@ANI) August 11, 2025
రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా, సంజయ్ రౌత్ , సాగరికా ఘోష్ వంటి ఇండియా కూటమి ఎంపీలు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. వాస్తవం ఏమిటంటే వారు మాట్లాడలేరని, నిజం దేశం ముందు ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ పోరాటం రాజకీయమైనది కాదని, ఈ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడటానికి అన్నారు. ఈ పోరాటం ఒక మనిషి, ఒక ఓటు కోసమే అన్నారు. తమకు స్వచ్ఛమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా కావాలన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications