నాపై దాడులకు సిద్దమయ్యారు - రాహుల్..!!
తనపై దాడి చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు వైరల్ అవుతోంది. లోక్‌సభలో తన చక్రవ్యూహం ప్రసంగం కొంతమందికి నచ్చలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో తనపై ఈడీ దాడులకు సిద్దమైనట్లు సమాచారం ఉందన్నారు. ఈడీతో సోదాలో చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు ఆయన ఆరోపించారు.
బడ్జెట్ పై ప్రసంగంలో భాగంగా రాహుల్ గాంధీ లోక్ సభలో చేసిన చక్రవ్యూహం వ్యాఖ్యల పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ సాగింది. నాడు పద్మవ్యూహంలో అభిమన్యుడిని ట్రాప్ చేసారని చెబుతూ..నేడు క్రవ్యూహంలో ఉన్న పరిస్థితులు అంటూ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేసారు. దేశం చక్రవ్యూహంలో చిక్కుకుపోయిందన్నారు. దేశంలో భయానక వాతావరంణ ఉందన్న రాహుల్.. ప్రధాని మోదీ పైన సంచలన వ్యాఖ్యలుతో విరుచుకుపడ్డారు. అభిమన్యుడు ఏ చక్రవ్యూహంలో చిక్కుకున్నాడో ఇప్పుడు దేశ ప్రజలు అలాగే చిక్కుకున్నారని వ్యాఖ్యానించారు.

మహాభారత చక్రవ్యూహాన్ని ఆరుగురు నియంత్రిస్తే..ఇప్పటి చక్రవ్యూహాన్ని ఆరుగురు నియంత్రిస్తున్నారంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. ఈ ఆరుగురితో మంత్రులు, రైతులు, ఓటర్లు, కార్మికులు అందరూ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. చక్రవ్యూహం పై తాను అధ్యయనం చేసానని పేర్కొన్నారు. 21వ శాతాబద్దంలో కొత్త చక్రవ్యూహం వచ్చిందన్నారు. అది కమలం ఆకారంలో ఉందని..ప్రధాని మోదీ తన ఛాతీ పైన కమలం ధరించారని రాహుల్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పైన బీజేపీ నుంచి అభ్యంతరం వ్యక్తం అయింది.
Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned.
— Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024
Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me.
ఇక, ఇప్పుడు తనపై దాడి చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్లాన్ చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు తనకు ఆ సమాచారాన్ని చేరవేసినట్లు చెప్పారు. పార్లమెంట్‌లో బీజేపీపై చక్రవ్యూహాం విమర్శలు చేసినందుకు .. ఈడీతో సోదాలో చేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు ఆయన ఆరోపించారు. అయితే ఈడీ తనిఖీలను ఎదుర్కొనేందుకు రిక్త హస్తాలతో ఎదురుచూస్తున్నట్లు రాహుల్ చెప్పారు. చక్రవ్యూహాంపై తన ప్రసంగాన్ని ఒక్కరిలో ఇద్దరు నచ్చలేదన్నారు. అయితే ఆ చక్రవ్యూహాన్ని ఇండియా కూటమి బద్దలు కొట్టనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications