సింగిల్ లైఫ్ కు శుభం కార్డు పడ్డట్టేనా..?, 'రాహుల్ పెళ్లి ముచ్చట'

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : 46 ఏళ్ల ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ ఇక తన సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేయబోతున్నారా..? ఆ మూడు ముళ్లేవో వేసేసి తన బ్యాచులర్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారా..? రాహుల్ పెళ్లిపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో రాహుల్ పెళ్లికి సంబంధించి ఇప్పుడు తెరపై హైలైట్ అవుతోన్న ప్రశ్నలివి.

ఓ రాజస్తాని పత్రిక త్వరలోనే రాహుల్ గాంధీ పెళ్లంటూ వార్తలను ప్రచురించడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఇందులో నిజానిజాల పరిధి ఎంతో తెలియదు గానీ సదరు పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం.. రాహుల్ కు తగ్గ జోడిని ఇప్పటికే అన్వేషించిన ఆయన కుటుంబం, ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బ్రాహ్మణ యువతితో రాహుల్ పెళ్లి నిశ్చయించినట్టుగా వెల్లడించింది.

 Rahul Gandhi may get married soon: Reports

అంతేకాదు, పెళ్లికి సంబంధించిన వేదిక కూడా ఇప్పటికే ఖరారైపోయిందని, అలహాబాద్ లో గతంలో ఉన్న నెహ్రూ ఇంటికి సమీపంలోని ఆనంద్ భవన్ లో రాహుల్ పెళ్లి వేడుకలు జరగబోతున్నట్టుగా పత్రిక పేర్కొంది. కాగా రాహుల్ పెళ్లి చేసుకోబోయే యువతి తండ్రి ఓ ప్రముఖ అధికారిగా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, గతంలో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న రోజుల్లో ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా వ్యవహరించిన వ్యక్తే రాహుల్ కు ఈ సంబంధాన్ని కుదిర్చినట్టుగా సమాచారం. మొత్తానికి ఇన్నాళ్లకు కాంగ్రెస్ యువరాజు వివాహాం ఖరారైందన్న వార్త ఇప్పుడు దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది.

రాహుల్ పెళ్లిపై సుబ్రహ్మణ్యస్వామి సెటైర్ :

రాహుల్ పెళ్లి వార్తలపై ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పెళ్లిపై సెటైర్లు వేశారు.
రాహుల్ పెళ్లిని సూర్యుడు పడమర వైపు ఉదయించడం లాంటిదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో బుద్దు ఓ బ్రాహ్మణ వర్గానికి చెందిన అమ్మాయిని వివాహాం చేసుకోబోతున్నట్టు తెలిసిందని చెబుతూ పెళ్లిపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As Modi government saw an expansion in its cabinet with the induction of 19 new faces on Tuesday, July 5, there were reports that the Congress scion and party vice-president Rahul Gandhi may be getting married soon

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి