రైల్వే స్టేషన్‌లో సూట్‌కేస్ మోసిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది.

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో వరుస భేటీలు ఏర్పాటవుతున్నాయి.

Rahul Gandhi meets railway porters at Anand Vihar railway station Delhi

అధికార బీజేపీ- ఎన్డీఏ దూకుడును అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రాగలిగింది. ఇండియా పేరుతో ప్రతిపక్ష పార్టీలతో ఉమ్మడి ఐక్య కూటమిని ఏర్పాటు చేసుకుంది. వారికి దిశానిర్దేశం చేసే బాధ్యతలను స్వీకరించింది కాంగ్రెస్. అటు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులకు సారథ్యాన్ని వహిస్తోంది.

ఈ పరిణామాల మధ్య- రాహుల్ గాంధీ ఢిల్లీలో విస్తృతంగా పర్యటించారు. సాధారణ పౌరుడిలా కలియతిరిగారు. ఈ ఉదయం ఆయన ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ రైల్వే కూలీలను కలిశారు. రైల్వే పోర్టర్లతో ముచ్చట్లు పెట్టారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. పోర్టర్ల మధ్య కూర్చుని వారు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించారు.

Rahul Gandhi meets railway porters at Anand Vihar railway station Delhi

కిందటి నెలలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కూలీలు.. ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ తమను కలవాలని, తాము ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని ఆ వీడియోలో స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని మనసున్న రాజకీయవేత్తగా అభివర్ణించారు.

ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది రాహుల్ గాాంధీ దృష్టికీ చేరింది. దీనితో ఈ ఉదయం ఆయన ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆయన కరోల్ బాగ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడున్న బైక్ మెకానిక్ షాప్‌ను సందర్శించారు. అక్కడి కార్మికులతో మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+