ఆన్‌లైన్ సెక్స్‌రాకెట్: ‘కిస్ ఆఫ్ లవ్’ నేత, భార్య అరెస్ట్

కొచ్చి: కేరళలో ‘కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమాలను నిర్వహించిన రాహుల్ పసుపాలన్, అతని భార్య, రేష్మి ఆర్ నాయర్ అనే ఓ మోడల్ తోపాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ బిగ్ డాడీ' పేరుతో నిర్వహించిన తనిఖీల్లో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నెడుంబసరీకి చెందిన ఈ దంపతులతోపాటు కసర్‌గడ్‌కు చెందిన పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ అక్బర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్నాకులం రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

మలప్పురం, త్రిసూర్, పాలక్కడ్‌లలో ఈ పోలీసు బృందాలు ఏక కాలంలో దాడులు జరిపాయి. క్రైం బ్రాంచ్ ఇచ్చిన సమాచారం మేరకు రహస్యంగా దర్యాప్తు జరిపిన పోలీసులు బృందాలు సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న వారిని అరెస్ట్ చేశాయి.

Rahul Pasupalan, wife held for online sex racket

‘కొచ్చు సుదరికల్' అనే ఫేస్‌బుక్ పేజీ ద్వారా అసభ్య చిత్రాలను పోస్టు చేస్తున్న వారిపై దృష్టి సారించారు. కాగా, మానవ హక్కుల సంఘాలు, మీడియా ప్రసారాలతో ఆ పేజీని రద్దు చేయడం జరిగింది.

ఆ తర్వాత మరోసారి ఆ పేజీ యాక్టివ్ అవడంతో పోలీసులు.. ఆ పేజీలో పోస్టు చేస్తున్న ఫొటోలు, కామెంట్స్‌ను పరిశీలించారు. పోలీసుల విచారణలో ఆ పేజీలో ఉన్న వారందరూ క్లైంట్స్‌గా తేలింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలను ట్రాప్ చేసి తీసుకొస్తున్నట్లు పోలీసులు తేల్చారు. గట్టి నిఘా వేసి నిందితులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+