రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అన్ని సేవలకూ ఒకటే యాప్.. ఇప్పుడే డౌన్ లోడ్ చేసుకోండి..
రైల్వే ప్రయాణికులకు భారీ శుభవార్త. ప్రయాణికుల కోసం సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. రైల్వే టికెట్స్ బుకింగ్, మీల్స్ బుకింగ్, ఫిర్యాదులు.. ఇలా అన్నింటికీ ఒకే యాప్ ను తీసుకొచ్చింది. RailOne పేరుతో ఒక సరికొత్త యాప్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యంగా, సులభంగా రైల్వే ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికుల భద్రత కోసం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి తీసుకురావడం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, పాత రైల్వే కోచ్ ల స్థానంలో కొత్త LHB కోచ్ లు.. ఇలా అనేక విధాలుగా రైల్వే వ్యవస్థను పటిష్టం చేస్తూ ప్రయాణికులకు సౌకర్యంగా, సులభంగా రైల్వే ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. తాజాగా రైల్వే ప్రయాణికుల కోసం ఆల్ ఇన్ వన్ కాన్సెప్ట్ తో సరికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రైల్వే టికెట్స్ బుకింగ్, మీల్స్ బుకింగ్, ఫిర్యాదులు.. ఇలా అన్నింటికీ ఒకే యాప్ ను తీసుకొచ్చింది. RailOne పేరుతో ఒక సరికొత్త యాప్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ను రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ ఆవిష్కరించారు. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్ లో ఈ యాప్ ను ప్రారంభించారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS) 40 వ దినోత్సవం సందర్భంగా ఈ RailOne యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న RailConnect, UTSonMobile యాప్స్ వివరాలతో ఈ యాప్‌లో లాగిన్ కావచ్చని రైల్వే శాఖ తెలిపింది. ఈ RailOne యాప్ లో Railway e-wallet సౌకర్యం కూడా ఉంటుందని పేర్కొంది. ప్రయాణికులు mPIN, బయోమెట్రిక్ ద్వారా లాగిన్ కావచ్చని వివరించింది. ఒకే యాప్ లో అన్ని ప్రయాణికుల సేవలను ఇది అందిస్తుంది. IRCTC రిజర్వ్‌డ్, అన్ రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫామ్ టిక్కెట్ లను బుక్ చేసుకోవడం, పీఎన్ ఆర్, రైలు ఎక్కడ ఉందో ట్రాకింగ్, కోచ్ పొజిషన్, ఫీడ్ బ్యాక్ తెలుసుకోవచ్చని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications