బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Rain: కుండపోత వానలు, ట్రాఫిక్ జామ్, రోడ్ల మీద గులాబ్ జామ్, ఐటీ హబ్ లో గంటలు గంటలు, దేవుడా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాలు వర్షం నీరు రోడ్ల మీదకు రావడంతో జలమయం అయ్యాయి. బెంగళూరులోని అనేక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోని నీళ్లు చేరిపోవడంతో జలమయం అయ్యాయి. బెంగళూరులో వరుసగా కరుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లోని రోడ్లు దెబ్బ తిన్నాయి. కుండపోత వానలతో విపరీతంగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులను గులాబ్ జామ్ కనపడుతోంది.

Illegal affair: ఇల్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్ భార్యతో వీడు ?, ప్రాణస్నేహితుడి చేతిలో !Illegal affair: ఇల్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్ భార్యతో వీడు ?, ప్రాణస్నేహితుడి చేతిలో !

బెంగళూరులోని పలు రహదారుల మీద అడుగుల ఎత్తులో నీళ్లు నిలిచిపోవడంతో చెరువులను తలపించాయి. పాదచారులు, వాహనచోదకులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బెంగళూరు నగరంలో నిత్యం రద్దీగా ఉండే సిల్క్ బోర్డు జంక్షన్ లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కావడంతో ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించే వాళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

 Rain: BBMP has received complaints from people on rain releted issues in Bengaluru.

బెంగళూరు-తుమకూరు రోడ్డు, బెంగళూరు- పాత మద్రాసు రోడ్డు, బెంగళూరు- హోసూరు రోడ్డులో విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. బెంగళూరు నగరంలో ఇళ్లల్లో నిలిచిపోయిన నీరు బయటకు పంపించడానికి ఇంటి యజమానులతో పాటు బీబీఎంపీ సిబ్బంది నానా తిప్పలు పడుతున్నారు.

 Rain: BBMP has received complaints from people on rain releted issues in Bengaluru.

Khiladi wife: ఉద్యోగం చేస్తున్న చోట భార్యకు ప్రియుడు, ఇంట్లో శవమైన మొగుడు, ఫోన్ కాల్స్ దెబ్బతో !Khiladi wife: ఉద్యోగం చేస్తున్న చోట భార్యకు ప్రియుడు, ఇంట్లో శవమైన మొగుడు, ఫోన్ కాల్స్ దెబ్బతో !

బెంగళూరు నగరంలోని అనేక పాత భవనాలు, శిథిలావస్థలో ఉన్న కట్టడాల్లో నివాసం ఉంటున్న ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. పలు చోట్ల నిర్మాణంలో ఉన్న కట్టడాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేస్తున్న కూలీలను అధికారులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే బెంగళూరు నగరంలో భారీ వర్షాల కారణంగా నిర్లక్షంగా పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు చనిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. భారీ వర్షాల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బెంగళూరు ప్రజలు బీబీఎంపీ అధికారులు అనేక ఫిర్యాదులు చేస్తున్నారు.

English summary
Rain: BBMP has received complaints from people on rain releted issues in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X