రాజకీయాల్లో రజనీ శకం మొదలైనట్లే!: ఎవరూ ఆపలేరంటూ రోడ్డెక్కిన ఫ్యాన్స్..

తమిళ రాజకీయాల్లో రజనీ శకం మొదలవబోతుందన్న ఊహాగానాల నడుమ.. ఆయన చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రజనీ లోకల్ కాదని తమిళ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తుంటే.. రజనీ

చెన్నై: తమిళ రాజకీయాల్లో రజనీ శకం మొదలవబోతుందన్న ఊహాగానాల నడుమ.. ఆయన చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రజనీ లోకల్ కాదని తమిళ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తుంటే.. రజనీ పక్కా లోకల్ అంటూ ఆయన అభిమాన గణం రోడ్డెక్కుతున్నారు.

తమిళ రాజకీయాల్లోకి రజనీ రాకను ఎవరూ అడ్డుకోలేరంటూ వ్యతిరేక గ్రూపులకు ధీటుగా జవాబిస్తున్నారు. తమిళ రాజకీయాల్లోకి రజనీ ఎంట్రీని స్వాగతిస్తూ.. ఆయన అభిమాన గణం చెన్నైలో మంగళవారం నాడు రాస్తారోకో నిర్వహించారు. బైక్స్‌పై రజనీ నామస్మరణ చేస్తూ రాజకీయంగా ఆయనకు మద్దతు పలికారు. పోయెస్ గార్డెన్‌లోని రజనీ ఇంటి వద్ద కూడా ఆయనకు అనుకూలంగా రాజకీయ నినాదాలు చేశారు.

rajinikanth fans bike rally in chennai to support rajini politics

ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో.. తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ వ్యూహాలకు పదునుపెట్టే పనుల్లో నిమగ్నమయ్యారన్న ప్రచారం కూడా జరగుతోంది. మరో వారం రోజుల్లో తలైవా తన రాజకీయ ప్రస్థానం గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.

రజనీ పొలిటికల్ ఎంట్రీ గనుక జరిగితే.. తమిళ తెర మీద ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీలకు గడ్డు పరిస్థితులు ఎదురైనట్లే లెక్క. అదే సమయంలో బీజేపీ ప్రలోభాలకు రజనీ లొంగుతారా? అనేది కూడా ఆసక్తికరం. వీటన్నింటి నేపథ్యంలో మరికొద్దిరోజుల్లో తలైవా రాజకీయ నిర్ణయం గురించి ఆయన అభిమానులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+