రజనీకాంత్, కమల్ హాసన్ మలేషియాలో భేటీ, అదే చర్చ, సినీరంగం ఆందోళన!

Recommended Video

    బ్రేకింగ్.. రజనీకాంత్ పొలిటికల్ పంచ్.. సినిమాలకు గుడ్‌బై !

    చెన్నై: సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేసిన వెంటనే ఆయనకు తమిళ సినీ రంగంతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ కు కొందరు మద్దతు ప్రకటించారు. ఇప్పుడు సూపర్ రజనీకాంత్, కమల్ హాసన్ మొదటి సారి తమిళనాడులో కాకుండా మలేషియాలో కలుసుకుని రాజకీయాలపై చర్చించనున్నారు.

     ప్రభుత్వం!

    ప్రభుత్వం!

    జయలలిత మరణించిన తరువాత తమిళనాడు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మీద వీలు చిక్కినప్పుడు ఒక్క సారి వదిలిపెట్టకుండా హీరో కమల్ హాసన్ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అదే స్థాయిలో మంత్రులు కమల్ హాసన్ మీద ఎదురుదాడికి దిగారు.

     అన్నాడీఎంకే మీద కోపం

    అన్నాడీఎంకే మీద కోపం

    తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వారి పదవులు కాపాడుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి సమయంలో తాను రాజకీయాల్లోకి రావడం ఎంతో అవసరం అని కమల్ హాసన్ చెప్పారు.

    వచ్చేశా!

    వచ్చేశా!

    తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించిన తరువాత హీరో కమల్ హాసన్ కేరళ ముఖ్యమంత్రి విజయన్ పినరయి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలను కలిసి వారి నుంచి రాజకీయ సలహాలు తీసుకున్నారు.

     సినీరంగంలో పోటీ

    సినీరంగంలో పోటీ

    కొన్ని దశాబ్ధాలుగా సినీరంగంలో తనకు పోటీగా ఉన్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లో ఇప్పుడు పోటీ వస్తున్నారని తెలుసుకున్న కమల్ కహాసన్ పైకి మాత్రం సంతోషం అంటున్నారు. అయితే లోపల మాత్రం ఎత్తులకు పై ఎత్తులు వెయ్యాలని నిర్ణయించారని తెలిసింది.

     మలేషియాలో చర్చలు!

    మలేషియాలో చర్చలు!

    నడిగర్ సంఘం మలేషియాలో ఏర్పాటు చేసిన స్టార్ నైట్ కార్యక్రమంలో హాజరుకావడానికి సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ అక్కడికి వెళ్లారు. మలేషియాలో రజనీకాంత్, కమల్ హాసన్ తమ రాజకీయ ప్రయాణం గురించి చర్చించే అవకాశం ఉందని వారి సన్నిహితులు అంటున్నారు.

    టార్గెట్ అన్నాడీఎంకే ?

    టార్గెట్ అన్నాడీఎంకే ?

    జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీ అతలాకుతలం అయ్యింది. ఈ సందర్బంలోనే తమిళ సినీరంగంలోని ఇద్దరు ప్రముఖులు రాజకీయ రంగప్రవేశం చేస్తున్నారు. ఇద్దరు హీరోలు అన్నాడీఎంకే పార్టీని టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

    సినీ రంగం ఆందోళన!

    సినీ రంగం ఆందోళన!

    సినీ రంగంలో ఇంత కాలం పోటీ పడిన రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే సారీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారని, వారి స్నేహం ఏమౌతుందో అంటూ తమిళ సినీ రంగానికి చెందిన పలువురు ప్రములు ఆందోళన చెందుతున్నారు. సినీ రంగంలో పోటీ ఉన్నా ఇద్దరూ స్నేహంగానే ఉన్నారని, ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా వారిద్దరూ అలాగే స్నేహంగానే ఉండాలని పలువురు సినీ ప్రములు కోరుకుంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+