తమిళనాట రజనీకాంత్ అలజడి!: మోడీ మద్దతు, కొత్త పార్టీ వస్తుందా?

తమిళనాడు రాజకీయాల్లో ఊహించన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత పోరు కనిపిస్తోంది.

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఊహించన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత పోరు కనిపిస్తోంది. ఓ విధంగా తమిళనాట రాజకీయ శూన్యత ఉంది. దీనిని బీజేపీ సొమ్ము చేసుకోవాలనుకుంటోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తోందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్‌కు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా అనే దాని పైన స్పష్టత రావడం లేదు.

దీంతో పలు ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే రజనీకాంత్ మద్దతును బీజేపీ, నరేంద్ర మోడీ కోరారు. అయితే, జయలలితతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగా అప్పుడు వెనక్కి తగ్గారని అంటున్నారు.

రాజకీయ శూన్యత

రాజకీయ శూన్యత

ఇప్పుడు తమిళనాట ఓ విధంగా రాజకీయ శూన్యత కనిపిస్తుండటంతో రజనీకాంత్ - నరేంద్ర మోడీలు చేతులు కలిపినా ఆశ్చర్యం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

జయలలిత మృతితో మలుపు తిరుగుతున్నతమిళ రాజకీయం

జయలలిత మృతితో మలుపు తిరుగుతున్నతమిళ రాజకీయం

జయలలితతో సత్సంబంధాల కారణంగా ఆయన పొలిటికల్ ఎంట్రీ లేదా బీజేపీకి మద్దతు పలకలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు జయలలిత మృతితో తమిళనాట.. ముఖ్యంగా అన్నాడీఎంకేలో పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.

సీఎం పీఠంపై శశికళ

సీఎం పీఠంపై శశికళ

ఎట్టకేలకు పన్నీరు సెల్వంను తప్పించి శశికళ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటున్నారు. పన్నీరు అసంతృప్తితోనే మెట్టు దిగారని చెబుతున్నారు. మరోవైపు దీపా జయకుమార్.. శశికళకు పెను సవాల్‌గా మారారు. తమిళనాట అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

అభిమానుల కోరిక

అభిమానుల కోరిక

ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ నేతృత్వంలో ఓ రాజకీయ పార్టీ రావొచ్చునని, అది బీజేపీకి అనుకూలంగా ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

నేరుగా సత్తా చాటే పరిస్థితి లేదు

నేరుగా సత్తా చాటే పరిస్థితి లేదు

తమిళనాడులో జాతీయ పార్టీలకు పెద్దగా ఆదరణ లేదు. బీజేపీ నేరుగా సత్తా చాటే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ మద్దతుతో సూపర్ స్టార్ నేతృత్వంలో పార్టీ రావొచ్చుననే ప్రచారం తమిళనాట పెద్ద ఎత్తున సాగుతోంది. రజనీకాంత్‌ను ఒప్పించి రాజకీయాల్లోకి తీసుకు రావడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నారు.

'పవర్' అలజడి

'పవర్' అలజడి

రెండు రోజుల క్రితం రజనీకాంత్ 'పవర్' గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది. పవర్ అంటే ఇష్టమని రజనీకాంత్ ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చెప్పారు. దానికి రాజకీయ రంగు పులుముకుంది. పవర్ అంటే అధికారం అనే దిశలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే రజనీకాంత్ దానిపై వివరణ ఇచ్చారు. పవర్ అంటే తన దృష్టి ఆధ్యాత్మిక శక్తి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+