ఇంత అందమైన ఎమ్మెల్యే ఉంటే..: బీజేపీ మహిళా ఎమ్మెల్యేపై వర్మ
ముంబై: నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈసారి అసోం నుంచి కొత్తగా గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే అంగూర్ లతా దేకా పైన పడ్డారు. ఆమె పైన ఆయన సెక్సిజం కామెంట్స్ చేశారు.
అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్ సింగ్, ప్రత్యేక హోదా విషయంలో పవన్ తీరును, ఆ తర్వాత మహేష్ బాబు, బ్రహ్మోత్సవం గురించి ట్వీట్లు చేసి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు అసోం బీజేపీ ఎమ్మెల్యే గురించి ట్విట్టర్లో స్పందించారు.
If MLA can look like this,Achche din aagaye hai..Thank you Angoorlataji,Thank you Modiji..1st time I love politics pic.twitter.com/WPzJgmnb13
— Ram Gopal Varma (@RGVzoomin) May 24, 2016
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసోం రాష్ట్రంలో బీజేపీ తొలిసారి పాగా వేసింది. బెంగాలీ, అస్సామీ చిత్రాల్లో నటించిన పాపులారిటీ సాధించిన అంగూర్‌లతా దేకా బీజేపీ టిక్కెట్‌పై విజయం సాధించారు. దీనిపై వర్మ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.
'ఒక ఎమ్మెల్యే ఇంత అందంగా ఉంటే.. అచ్చే దిన్ వచ్చేసినట్లే. థ్యాంక్యూ అంగూర్ లతా, మోడీ గారు. మొదటిసారి రాజకీయాలంటే ఇష్టం కలుగుతోంది' అంటూ కామెంట్స్ చేశారు.












Click it and Unblock the Notifications